కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కు అన్యాయం జరిగిందని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సీహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అఖిల కార్మిక కర్షక జేఏసీ.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అఖిల కార్మిక కర్షక జేఏసీ.. కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ సిగ్నేచర్ ను ఏయూ జర్నలిజం విభాగంలో మొదలుపెట్టారు. విభాగాధిపతి ఆచార్య డీవీఆర్ మూర్తి తొలి సంతకం చేశారు.
విశాఖ అంటే స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది
ప్రతి ప్రాంతానికి ఓ గుర్తింపు ఉంటుందని.. విశాఖ అంటే స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుందని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సీహెచ్ నరసింగరావు అన్నారు.అలాంటి స్టీల్ ప్లాంట్కు.. కేంద్రం గనులు కేటాయించకుండా ప్రైవేటీకరణ నిర్ణయం సరైంది కాదని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు.