Suryaa.co.in

Andhra Pradesh

క్షయ రోగులను ఆదుకునేందుకు ముందుకు రండి

– కార్పొరేట్ యాజమాన్యాలకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు వినతి

అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా క్షయ రోగులకు అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలకు విజ్నప్తి చేశారు. మంగళగిరి ఎపి ఐఐసి టవర్స్లోని తన ఛాంబర్లో కొహన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ఎంఎస్ ఎన్ రెడ్డి క్షయ రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందచేసేందుకు కనెక్ట్ టు ఆంధ్రా సంస్థ సిఇఓ శివశంకర్ ద్వారా శుక్రవారం కృష్ణ బాబు కు రు.40 లక్షల చెక్ ను అందజేశారు.

ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ కోహెన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ స్ఫూర్తితో క్షయరోగులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందచేసేందుకు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పర్చేందుకు , మెరుగైన సేవలందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఉస్తున్నారన్నారు. టిబి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు.

నిధుల సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న కనెక్ట్ టు ఆంధ్రా సిఇఓకు ఈ సందర్భంగా కృష్ణ బాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె. నివాస్ మాట్లాడుతూ 33,745 మంది టీబీ రోగులకు అదనపు పోషాకాహారం నిమిత్తం ఫుడ్ బాస్కెట్లను అందచేశామన్నారు. ఎన్టిఆర్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలో రానున్న ఆరు నెలల కాలంలో మరో 2,417 మంది టిబి రోగులకు రు. 78 లక్షల విలువైన ఫుడ్ బాస్కెట్లను అందచేయనున్నామని తెలిపారు.

జాయింట్ డైరెక్టర్ (టిబి) డాక్టర్ టి రమేష్ మాట్లాడుతూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ నివాస్ సూచనల మేరకు రాష్ట్రంలోని నిరుపేద టిబి రోగులను ఆదుకునేందుకు నిక్షయ్ మిత్రలుగా రిజిస్టర్ చేసుకోవాలని తాము కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కొహెన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా కనెక్ట్ టు ఆంధ్రా సంస్థ సమన్వయంతో టిబి రోగులకు బలవర్ధక ఆహారాన్ని అందచేసేందుకు సహకారాన్ని అందిస్తున్నామన్నారు.

ఇందుకు సంబంధించి ఇటీవలే ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావుకు తాము రు.38 లక్షల విరాళాన్ని అందచేశామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కొహెన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ సిఎస్ఆర్ కార్యకలాపాల సమన్వయ కర్త పిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE