గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
-ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-పెనుమాకలో పింఛన్ల పంపిణీ కోసం లబ్ధిదారు ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు
-పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
నరసరావుపేటలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ
-నరసరావుపేటలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు
-లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే
-పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా
-నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
-జిల్లా వ్యాప్తంగా 8,500 ఉద్యోగులు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు.
-జిల్లాలో 313757 మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు పంపిణీ చేస్తారు.
-కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తెనాలి
-నియోజకవర్గంలో వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేసిన మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
-కొలకలూరు ,నందివెలుగు, బుర్రిపాలెం గ్రామాల్లో, కొల్లిపర మండలం మరియు పట్టణ వార్డుల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, పెన్షన్ పంపిణీ చేసిన మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
-కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు.
పల్నాడు జిల్లా వినుకొండ
అంబేద్కర్ నగర్ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు మరియు జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్ పాల్గొని పింఛన్ లబ్ధిదారులు. మంద పేరయ్య, వల్లేరు పేరయ్య, గాలిమ్మ, మెలిక మల్లేశ్వరి ఆయన చేతుల మీదగా అందజేశారు. ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7 వేల రూపాయలు చొప్పున పింఛన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ప్రత్తిపాడు నియోజకవర్గం
-ప్రత్తిపాడు నియోజకవర్గంలో వృద్ధులకు వికలాంగులకు, వితంతువులకు ఫెంక్షన్లను స్వయంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కార్యకర్తలు నేతలు .
-ఎన్నికల హామీలలో ఒకటైన ఫెంక్షన్ పధకం పెంపును అమలుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రామాంజనేయులు.
-పెంచిన ఫెంక్షన్ చేతికి అందడంతో ఆనందం వ్యక్తం చేసిన పెంక్షన్ దారులు.