Suryaa.co.in

Andhra Pradesh

పొన్నవోలుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

– చంద్రబాబు, లోకేష్ లపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన పొన్నవోలుపై కేసు నమోదు చేయాలి
-టిడిపి పరిశోధన & సమాచార కమిటి సభ్యులు తోపూరి గంగాధర్

మంగళగిరి: టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి, యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోలలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..పొన్నవోలుపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో తెదేపా పరిశోధన మరియు సమాచార కమిటీ సభ్యులు తోపూరి గంగాధర్ ఫిర్యాదు చేశారు.

జగనన్నను వేటాడారని, జగన్ ను చంపేస్తే ఏందని చంద్రబాబు అన్నట్లు పొన్నవోలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని గంగాధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలలో 35 ఇంచులు కూడా తను, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను టచ్ కూడా చేయనీయలేదని గప్పాలు కొంటుకున్నాడు. పొన్నవోలుకు, ఆర్.కె కు రూ.150 కోట్లు ఆఫర్ ఇచ్చారని పొన్నవోలు చెప్పాడు.

తనకు రూ. 150 కోట్లు ఆఫర్ ఎవరిస్తానన్నారో, అందుకు ఆధారాలేంటో పొన్నవోలు బయటపెట్టాలి. పొన్నవోలు అదనపు అడ్వకేట్ జనరల్ గా ఉండి వైసీపీ కార్యకర్తలా జగన్ రెడ్డికి కొమ్ముకాశాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేరపూరితమైన అభ్యంతరకరమైన, సత్యదూరమైన, ఆధార రహితమైన మాటలతో, వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించుటకు, అల్లర్లను కొట్లాటలను సృష్టించుటకు, ప్రయత్నించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఎఫ్.ఐ.ఆర్ నమోడు చేసి సముచిత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో కోరారు. గంగాధర్ తో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని వందనాదేవి, అడ్వకేట్ ఆలా చంద్రశేఖర్ మంగళగిరి రూరల్ పోలీసులను కలిశారు.

LEAVE A RESPONSE