Suryaa.co.in

Telangana

హీరో నాగార్జునకు చెందిన ‘ఎన్‌ కన్వెన్షన్​’పై హైడ్రాకు ఫిర్యాదు!

– ప్రభుత్వ నిర్ణయంపై అందరి చూపు

హైదరాబాద్‌: సినీహీరో నాగార్జునకు బిగ్ షాక్ తగలనుంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్​పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీలోని తుమ్మిడి చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని జనం కోసం సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. చెరువుకు సంబంధించి మూడు ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్టు ఆ సంస్థ ఆరోపించింది. 29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువును పునరుద్దరించాలని ఫిర్యాదులో కోరింది. ఈ ఫిర్యాదుపై హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు పలు సంస్థల అక్రమ నిర్మాణాలను కూల్చిన హైడ్రా.. సంపన్నుల వ్యక్తుల జోలికి మాత్రం పోలేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హైడ్రా ఏ విధంగా ముందుకెళ్తుందనేది చూడాలి. కాగా గతంలోనూ ఎన్–కన్వెన్షన్​ పై విమర్శలు వచ్చాయి. అప్పట్లోనే కూల్చేస్తారనే ప్రచారం జరిగినా.. అది మధ్యలోనే ఆగిపోయింది.

LEAVE A RESPONSE