Suryaa.co.in

Andhra Pradesh

తాగునీరు-సాగునీటి పనులు పూర్తి చేయండి

– ప్రాధాన్యతాపరమైన ప్రాజెక్టులపై దృష్టి
– నిధుల విడుదలకు సీఎం గ్రీన్‌సిగ్నల్
– హంద్రీనీవా రెండవ ఫేజ్ లో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలి
– జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
– మంత్రి రామానాయుడుతో పాటు సమీక్షకు హాజరైన జిల్లాల నుంచి వచ్చిన ఇరిగేషన్ అధికారులు
– ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి సమీక్ష
– ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టి…సాధ్యమైనంత త్వరగా నీటిని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్ష

అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబునాయుడు సచివాలయంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తాగునీరు-సాగునీరు ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు పలు ప్రాజెక్టుల పూర్తికి నిధులు విడుదల చేయాలన్న అధికారుల వినతిని అంగీకరించారు. ప్రాధాన్యతాపరంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

• ముందుగా పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు
• పోలవరం పనుల్లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏరియాలో డీ వాటర్ పనులు మొదలుపట్టినట్లు వివరించిన అధికారులు. ఈ ప్రాంతంలో వాటర్ లెవల్ ను 19 మీటర్ల నుంచి 16 మీటర్లకు ఇప్పటి వరకుతగ్గించినట్లు తెలిపిన అధికారులు
• ఇప్పటి వరకు 0.29 టిఎంసి వాటర్ ను డీవాటరింగ్ ద్వారా తీసివేసినట్లు తెలిపిన అధికారులు
• బావర్ కంపెనీ ద్వారానే డయా ఫ్రం వాల్ పనులు…2026 మార్చినాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి చేస్తాం అని తెలిపిన బావర్ కంపెనీ ప్రతినిధులు…అంతకంటే ముందుగానే పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలన్న సీఎం చంద్రబాబు
• పోలవరంలో ఫేజ్ 1 పనుల కోసం రూ.7213 కోట్లతో భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఖర్చు పెట్టాల్సి ఉందని తెలిపిన అధికారులు. దశల వారీగా ఈ నిధులు మంజూరుతో పనులు పూర్తి చేయాలన్న సిఎం.
• డయా ఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలకు ఎంత సమయం పడుతుందనేది నిర్థిష్ట యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి
• దాని ఆధారంగా యాక్షన్ ప్లాన్ పై ప్రకటన చేద్దాం అని తెలిపిన ముఖ్యమంత్రి.
• హంద్రీనీవా సుజల స్రవంతి మెయిన్ కెనాల్ సామర్థ్యాన్నిపెంచే అంశంపై చర్చ
• రూ.2561 కోట్లు ఖర్చుపెడితే మొత్తం హంద్రీనీవా కాలువల లైనింగ్ పనులు పూర్తి చెయ్యవచ్చని తెలిపిన అధికారులు…దీని ద్వారా కాలువల సామర్థ్యం పెంపుతో పాటు లైనింగ్ పనులు కూడా పూర్తి చెయ్యవచ్చని తెలిపిన అధికారులు…దీనికి అంగీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• హంద్రీనీవా రెండవ ఫేజ్ లో భాగంగా అడవి పల్లి రిజర్వాయర్ కు, నీవా బ్రాంచ్ కెనాల్ కు నీటిని తీసుకువెళ్లేందుకు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం
• చింతలపూడి లిప్ట్ ఇరిగేషన్ పథకం ఫేజ్ 1 పూర్తికి ఇంకా రూ.2043 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన అధికారులు. వచ్చే సీజన్ నాటికి మొదటి దశలో నీరు అందించేందుకు అవసరమైన పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ సమస్యల పరిష్కారం కోసం వారంలో ప్రణాళికతో రావాలని అధికారులకు సూచించిన సిఎం
• గోదావరి పెన్నా అనుసంధానంపై ప్రణాళికపై చర్చించిన సీఎం. దీనిపై మరింత సమగ్ర చర్చకు వివిధ ప్రణాళికలతో రావాలని అధికారులకు సూచించిన సిఎం
• వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ 1లో రూ.1458కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో సివిల్ వర్కులు రూ.200 కోట్లు కాగా మిగిలింది ఆర్ అండ్ ఆర్ , భూసేకరణ ఖర్చు.
• ఫేజ్ 1లో భాగంగా 1.19 లక్షల ఎకరాలకు వచ్చే సీజన్ నాటికి నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలన్న సీఎం…దీనికి అవసరమైన నిధులు విడుదలకు అంగీకారం.
• ఈ ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్కులు, టన్నెల్స్ 1,2, ఫీడర్ చానల్ , రిజర్వాయర్ రెగ్యులేటర్ వంటి నిలిచిపోయిన పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి నీరు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి
• ఉత్తరాంధ్రలో వంశధార ఫేజ్ 2 ప్రాజెక్టుకు రూ.122 కోట్లు ఖర్చు అవుతుంది. వీటిని వచ్చే సీజన్ నాటికి పూర్తి చేస్తామన్న అధికారులు.
• ఎపిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం 983 టిఎంసిల నీటి నిల్వ కెపాసిటీ కాగా ప్రస్తుతం 840 టిఎంల నీరు ఉందని తెలిపిన అధికారులు.
• వర్షాలు తగ్గి, వరదలు తగ్గేలోగా ఎంత సాధ్యం అయితే అంత నీరు తరలించి రిజర్వాయర్లు నింపాలన్న సిఎం
• సోమశిల, కండలేరుకు మరో 46 టిఎంసిల నీరు వస్తే పూర్తిగా నిండే అవకాశం ఉందని వివరించిన అధికారులు. నవంబర్ లోపు ఈ రెండు ప్రాజెక్టులు నీటితో నింపుతామని తెలిపిన అధికారులు
• సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా బాలాజీ రిజర్వాయర్ కు నీటిని తీసుకువెళ్లేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్న ముఖ్యమంత్రి
• ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో ఇంకా 21 టిఎంసి నీటి నిల్వకు అవకాశం ఉందని తెలిపిన అధికారులు. ఉత్తరాంధ్రకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యతను ఇచ్చి సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యాలన్న సిఎం
• గ్రౌండ్ వాటర్ మానిటరింగ్, రిజర్వాయర్ వాటర్ లెవర్ మానిటరింగ్ నెట్ వర్క్ ఏర్పాటుకు అవసరం అయిన రూ.23 కోట్లు ఇచ్చేందుకు సిఎం అంగీకారం
• సమగ్ర వివరాలతో వాటర్ పాలసీ విడుదల చేసే ఆలోచన లో రాష్ట ప్రభుత్వం
• నదుల అనుసంధానం, నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, కరువు రహిత రాష్ట్రం అనే అంశాలతో వాటర్ పాలసీ
• సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కోసం ప్రతి సంవత్సరం రూ.983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా…గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం రూ.275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపిన అధికారులు. ఈ ఏడాదికి గాను అవసరం అయిన రూ.983 కోట్లు ఇచ్చేందుకు సిఎం అంగీకారం.
• పంట కాలువలు, డ్రైన్లు, రిజర్వాయర్ల నిర్వహణకు అవసరం అయిన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ మేనేజ్ మెంట్ పద్దతిన తీసుకోవాలని సిఎం సూచన.
• గత ప్రభుత్వ అసమర్థ విధానాలు, నిర్వహణా లోపాల కారణంగా ఇరిగేషన్ డెవల్మెంట్ కార్పొరేషన్ పరిథిలోని మొత్తం 467 లిఫ్ట్ స్కీంలు మూలనడ్డాయని, ఈ కారణంగా 2.90 లక్షల ఎకరాల సాగు తగ్గిందన్న అధికారులు.
• ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్రంలో మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న 8.11 లక్షల ఎకరాల సాగుకు అవసరం అయిన 1047 ఎత్తిపోతల పథకాల నిర్వహణ కోసం, రిపేర్లు కోసం 10 ఏళ్లకు యాన్యుటీ పద్దతిన ప్రణాళిక సిద్దం చేయాలని సిఎం చంద్రబాబు సూచించారు.
• నిలిచిపోయిన వరల్డ్ బ్యాంక్, జైకా,PMKSY, CADWM సంస్థల నిధులను మళ్లీ రాబట్టి, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తేవాలని ఆదేశించిన సీఎం.

LEAVE A RESPONSE