-దాని కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
-గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆదేశం
-గృహనిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న గృహాలను సకాలంలో పూర్తి చేయటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాలికను రూపొందించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర, సంభందాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌర, సంభందాల శాఖ మంత్రిగా ఇటీవల భాద్యతలు స్వీకరించిన మంత్రి పార్ధసారధి మంగళవారం గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో గృహనిర్మాణ సంస్థలో అమలు జరుగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ్ జైన్, గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమహమ్మద్ దివాన్ మైడెన్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గిరీష, ఇతర ఉన్నతాధికారులు, పశ్శిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ ,గుంటూరు జిల్లాల గృహనిర్మాణ శాఖ హెడ్ లు, పాల్గొన్నారు.
లబ్దిదారులకు అన్ని సౌకర్యాలతో గృహాలు నిర్మించే భాద్యత ప్రభుత్వానిపై ఉందని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించటానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి,ప్రతి కాలానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటానికి తీసుకోవాల్సిన చర్యల పై నివేదికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
గృహనిర్మాణాలు సాకాలంలో పూర్తి చేయటానికి అవసరమైన సిబ్బంది ఉండాలని,క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన సిబ్బందని ఏవిధంగా నియమించుకోవాలి,ఇతర ప్రభుత్వ విభాగాలులో పనిచేస్తున్న సిబ్బందిని డెప్యుటేషన్ లో తీసుకోవటం, రిటైరు అయిన ఉద్యోగులను పౌర సేవల ద్వారా తీసుకోవటం తదితర అంశాలపై నివిదిక తయారు చేయాలని, దానిపై ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుందామని మంత్రి తెలియజేశారు. కాలనీలలో మౌలిక సదుపాయాలు కలుగ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించటానికి గల అవకాశాల పై నివేదికలు రూపొందించాలని, కేంద్ర మంత్రులు,అధికారులుతో చర్చించి నిధులు విడుదల అయ్యే విధంగా కృషి చేద్దామని మంత్రి అధికారులకు సూచించారు.
ఆప్షన్- 3 కింద నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారులతో సమావేశాలు నిర్వహించాలని, వారితో చర్చించి సకాలంలో గృహాలు పూర్తీ చేయటానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సంస్థలో అమలు జరుతున్న అభివృద్ధి కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా గృహాలు నిర్మించటానికి అవసరమైన కార్యాచరణను రూపొందించి నివిదేకను త్వరలో అందచేస్తామని మంత్రికి తెలియచేశారు.
మంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయానికి వచ్చిన మంత్రికి గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.