ఎప్పుడూ లేఖల్లో కూడా పార్టీ అశాశ్వత (శాశ్వతకు ఈసీ ఒప్పుకోలేదు) అధ్యక్షుడి సంతకం ఉండదు.
ప్రకటన 1: మే 16, 2018 – “మాకు వారితో సంబంధం లేదు!”
పార్టీ అధిష్టానం మే 16, 2018న విడుదల చేసిన మొదటి ప్రకటన, సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న పోస్టులకు, ‘జగన్ కోసం’ అంటూ వారు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులకు, ఫేస్ బుక్ పోస్టులకు వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
ముఖ్యంగా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న మరియు పార్టీ పేరు వాడుకుంటున్న వ్యక్తులు – రఘురామిరెడ్డి, వలరా రవీంద్రారెడ్డి, యక్కంటిరెడ్డి, ఆనం సరస్వతిరెడ్డి, ఏ.ఎస్.ఆర్.రెడ్డి – ఎవరూ కూడా వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు కారని పార్టీ స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రకటన, పార్టీ తరపున ఎవరు మాట్లాడతారు అనే విషయంలో అధికారికతను గీత గీసి చూపింది.
ప్రకటన 2: జూన్ 4, 2018 – ‘బోరుగడ్డ’కు కీలక బాధ్యత!
మొదటి ప్రకటన విడుదలైన సరిగ్గా 19 రోజుల తర్వాత, జూన్ 4, 2018న పార్టీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, గుంటూరు జిల్లా, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన శ్రీ బోరుగడ్డ అనిల్ కుమార్ గారిని పార్టీ *”రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి”*గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
సోషల్ మీడియాలో ‘తప్పుడు’ ప్రచారం చేసే వ్యక్తులను దూరం పెట్టిన కొన్ని వారాలకే, బోరుగడ్డ అనిల్ కుమార్ గారికి పార్టీలోని కీలక ‘ప్రచార విభాగం’ బాధ్యతను అప్పగించడం గమనార్హం. ఇది, అనధికారిక ప్రచారాన్ని అరికట్టి, పార్టీ తరపున అధికారికంగా మరియు సమర్థవంతంగా మాట్లాడే వ్యక్తులను పార్టీ గుర్తించి, వారికి తగిన స్థానం కల్పిస్తోందనే సందేశాన్ని పంపింది.
తాజాగా బోరుగడ్డ కి మా పార్టీకి సంబంధం లేదని వెంకటరెడ్డి, వాడెవడు నిన్నలేక మొన్న వచ్చిన బోడిగాడు పగల్తాది వాడికి మర్యాద ఇవ్వకపోతే… అని బోరుగడ్డ క్లీన్ వార్నింగ్.
అయోమయంలో ఫేక్ వైకాపా 5 రూపాయల కార్మికులు….
