మీ మిషన్ పూర్తి అయిందేమో ! గాంధీజీని హత్య చేసిన 77 ఏళ్ళకు ఆయన పేరు మీద ఉన్న ఒక జాతీయ పథకానికి ఆయన పేరు తీసివేయబడింది . బహుశా గాంధీజీ పేరు మీద ఉన్న పథకం పేరుని తీసేయటం ఇదే మొదలేమో ! ఇంకా ఏమయినా తీసేసారా !?
ఫరవాలేదు . యన్టీఆర్ పేరు తీసేసి వైయస్సార్ పేరు పెట్టారు . వైయస్సార్ పేరు తీసేసి మళ్ళా యన్టీఆర్ పేరు పెట్టారు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి. అలాగే రాజీవ్ పేరు తీసేసి యన్టీఆర్ , యన్టీఆర్ పేరు తీసేసి వైయస్సార్ , మళ్ళా యన్టీఆర్ . ఆరోగ్య పథకానికి వచ్చిన తిప్పలు ఇవి . అలాగే గాంధీజీ అభిమానులు అధికారం లోకి రాగానే మళ్ళా గాంధీజీ పేరు పునరుధ్ధరించబడుతుంది .
History is not history if it doesn’t repeat .
అది పెద్ద విషయం కాదు . రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ వంటి భాజపా పెద్దలు, రాముడి పేరు పెడితే కూడా రాధ్ధాంతమా అని అన్నారు . చనిపోయే ముందు ఆయన హే రాం అనే అన్నారు అని కూడా అన్నారు . ఇంకా ఆ వీడియో క్లిప్ ఉందనే అనుకుంటాను నెట్లో . రాముడు ఇందుకు కూడా ఉపయోగపడ్డాడు . సంతోషం . ఆయనే కాదు ; మరి కొందరు జాతీయవాద మిత్రులు కూడా ఇదే స్టేండ్ తీసుకుని సోషల్ మీడియాలో , బయటా మాట్లాడుతున్నారు .
తీసివేయటం అధికారంలో ఉన్న వారిష్టం . ఎవరెవరి పేర్లో తీసేసిన భాజపా ప్రభుత్వం గాంధీజీ దాకా రావటమే , అదీ 240 సీట్లతోనే చేయటం , గొప్ప విషయం . ఆ ప్రభుత్వంలో తెదేపా ఉండటం కూడా చరిత్రలో భాగం అవుతుంది . A good precedent . ఇంకా చాలా చాలా వ్రాయాలని మనసు కొట్టుకులాడుతుంది . అంతా ఒకే సారి ఎందుకు !?
– ప్రొఫెసర్ దోగిపర్తి సుబ్రమణ్యం
( గాంధీ-నెహ్రూ విద్వేష ప్రతిఘటన వేదిక వ్యవస్థాపకులు )