రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్
న్యూజిలాండ్ లో ఇటీవల జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన విజయవాడకు చెందిన మాత్రపు జెస్సీరాజ్ అత్యున్నత ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రధమ స్థానంలో నిలవడం హర్షణీయం. ఇన్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన జెస్సీరాజ్ కు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మన విజయవాడకు చెందిన బాలిక ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయడం గర్వంగా ఉంది. జెస్సీ రాజ్ లాంటి ప్రతిభగల క్రీడాకారిణిలకు మా ప్రభుత్వం అన్నివిధాలా సహాయ,సహకారాలను అందించి ప్రోత్సహిస్తుంది.