Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు

– వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్

అమరావతి: ” తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి, నాయకులకు, లక్షలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులకు నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. గత 42 ఏళ్లుగా జాతీయ రాజకీయాల్లోనూ, ప్రజా జీవితంలోనూ తెలుగుదేశం పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 60 శాతం స్ట్రైక్ రేట్‌తో 10 ఎన్నికల్లో 6 విజయాలతో, టీడీపీ మన దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో అత్యంత విజయవంతమైన ప్రాంతీయ పార్టీగా నిలిచింది.

కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కూడా టిడిపి కీలక పాత్ర పోషించింది, మరే ఇతర ప్రాంతీయ పార్టీకీ ఈ అవకాశం దక్కలేదు. అన్ని సందర్భాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేసింది. టిడిపి వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దేశంలో సంక్షేమం యొక్క చరిత్రను తిరగ రాస్తే… సీబీఎన్ సంక్షేమం మరియు అభివృద్ధి సమ్మిళిత విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు.

ఆయన మన దేశంలోని దార్శనిక నాయకులలో ఒకరు. సీబీఎన్ టీడీపీని బలమైన క్యాడర్ ఆధారిత పార్టీగా నిర్మించారు. దీనివల్లే సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని పరీక్షా సమయాలను తట్టుకుని దీటుగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశ నిర్మాణంలో టిడిపి మరియు దాని నాయకత్వం మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE