-రైతు ఖాతాల్లో రైతుబంధును వెంటనే జమ చేయాలి
-రూ. 500 గ్యాస్ కోసం ఎజన్సీల ముందుకు మహిళలు క్యూ
-బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
అభివృద్ధితో కూడిన జాతీయవాదానికి జనం పట్టం కడతారని మూడు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అఖండ విజయం, ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా రుజువు చేసాయి. మోదీ గ్యారంటీకి, ఇతరుల గారడీ మాటలకు మధ్య ఉన్న తేడా ప్రజలకు తెలుసు కాబట్టే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు.
ప్రధాని మోదీపై, ఆయన పాలనపై చాలామంది చిల్లర మాటలు మాట్లాడారు. దేశం కీర్తిని దిగజార్చేలా మాట్లాడిన్రు. వారి మాటలకు ఈ ఎన్నికల ఫలితాలు చెంపదెబ్బ లాంటిది. తమ భవిష్యత్తును భద్రంగా చూసుకునే పార్టీ ఏదో ప్రజలు మరోసారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అందుకే మూడు రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను మంచి మెజారిటీతో గెలిపించారు. మధ్యప్రదేశ్లో ఇరవయ్యేళ్లుగా బీజీపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధికి మళ్లీ పట్టం కట్టిన్రు.
రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. తెలంగాణలోనూ కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడారు. ప్రధాని మోదీకి, ఆయన పాలనా దక్షతకు మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కానుకగా ఇచ్చారు. తెలంగాణలో లోపాయికారి ఒప్పందంతో ఉన్న పార్టీలు బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రజా వ్యతిరేకతను తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ.
తెలంగాణలో మార్పు రావాలనే ఒక ఆలోచన తీసుకొచ్చింది బిజెపి. తెలంగాణలోనూ సీట్లు, ఓట్ల శాతం పెంచి భవిష్యత్తు బీజేపీదే అని భరోసా ఇచ్చారు. ఇది నిస్సందేహంగా ప్రధాని మోదీ చరిష్మా, ఆయన సారథ్యంలోని బీజేపీ పాలన ఘనతే.2024లోనూ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజల తీర్పు మళ్లీ నరేంద్ర మోదీ వైపే ఉంటుందని మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ రెట్టింపుగా పుంజుకున్నది. 8 సెగ్మెంట్లు కైవసం చేసుకుంది.
చాలాచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గట్టిపోటీ ఇవ్వడంతో పాటు బలమైన అభ్యర్థులను ఓడించడంలోనూ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీ సాధించింది. మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను ఓడించి బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో మట్టి కరింపించారు. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్తాం.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే.ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతోంది. మూడు పార్టీలు ఒక్కటేనని ప్రొటెం స్పీకర్ ఎన్నిక స్పష్టం చేస్తోంది.రైతు ఖాతాల్లో రైతుబంధును వెంటనే జమ చేయాలి. రూ. 500 గ్యాస్ కోసం ఎజన్సీల ముందుకు మహిళలు క్యూ కడ్తున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై బీజేపీ పోరాటం వలనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
ఉచిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఎవరు ఎవరితో కుమక్కు అయ్యారో తాజా పరిణామాలే ఉదాహరణ. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు శాతం, సీట్లను గణనీయంగా పెంచుకుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలవబోతోంది.తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. అర్థిక భారాన్ని సాకుగా చూపి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ఎగనామం పెట్టకూడదు.ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే.
వరుసగా మూడోసారి నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కాబోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 403స్థానాలను గెలవబోతోంది. రాహుల్ గాంధీ సన్నిహిత ఎంపీ సాహూ ఇంట్లో వందల కోట్లు దొరకటం సిగ్గుచేటు. అవినీతి సామ్రాట్ లు నరేంద్రమోదీని గద్దె దించాలని చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావు. మోదీ హాయాంలో అభివృద్ధిలో భారతదేశం దూసుకుపోతోంది.