– బీఆర్ఎస్ పార్టీ బీసీలను దగా చేసింది
– ఇందిరాపార్క్ వద్ద బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా సభలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రమొస్తే బీసీలకు న్యాయం జరగుతుందని బీసీలంతా కలలుగన్నరు. 2014 నుంచి 2023 వరకు పాలించిన బీఆర్ఎస్ పార్టీ బీసీలను దగా చేసింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది.
42 శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామని, బీసీల అభివృద్ధికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. అధికారిక పదవుల్లో 42 శాతం పదవుల్లో బీసీలకు కేటాయిస్తామన్నరు.
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. అదేవిధంగా కాంగ్రెస్ కు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ కేబినెట్ లో 42 శాతం బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి.
42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ముస్లింలు లేనటువంటి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలి.