Suryaa.co.in

Telangana

దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్!

-రైతాంగాన్ని ఆగం చేసిందే వారి దుష్ట పాల‌న‌
-కాంగ్రెస్ హయాంలో తాగీటందుకు కూడా నీళ్ళు లేవు
-క‌రెంటు క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు
-కెసిఆర్ సీఎం అయ్యాకే రైతుల క‌ళ్ళ‌ల్లో ఆనందం
-రైతుల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాల అమ‌లు
-రైతుల కోసం ఇంత‌గా చేసిన ప్ర‌భుత్వం న భూతో న భ‌విష్య‌త్‌
-దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో భూముల రేట్లు
-3 గంట‌ల విద్యుత్ చాల‌న్న రేవంత్ రెడ్డిని రైతులు నిల‌దీయాలి
-గ‌తంలో రాష్ట్రాన్ని దేశాన్ని అంధ‌కార బందురం చేసిన కాంగ్రెస్ ను నిలువ‌రించాలి
– రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, పాలకుర్తిలో మండ‌లంలోని ప‌లు రైతు క్ల‌స్ట‌ర్ల‌ను క‌లిపి నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల‌కు పిలుపు

దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ! రైతాంగాన్ని ఆగం చేసిందే ఆ పార్టీ దుష్ట పాల‌న‌. వారి పాల‌న‌లో సాగునీరు కాదు క‌దా, క‌నీసం తాంగేందుకు కూడా నీళ్ళు లేని దుస్థితి. క‌రెంటు క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారి పాల‌న‌లో అంతా అంధ‌కార బందుర‌మేన‌ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలంలోని ప‌లు రైతు వేదికల ప‌రిధిలోని రైతులతో కలిపి పాల‌కుర్తిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కాంగ్రెస్ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా విమ‌ర్శించారు.

పైగా టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించ‌క‌పోవ‌డం కాంగ్రెస్ పార్టీ వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మ‌ని మండి ప‌డ్డారు. ఇలాంటి రైతు వ్య‌తిరేక కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగిన‌ట్లేన‌ని చెప్పారు. ఆ పార్టీకి త‌గిన బుద్ధి చెప్పాల‌ని బిఆర్ ఎస్ శ్రేణుల‌కు, రైతుల‌కు మంత్రి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ పాల‌న అంతా అంధ‌కార బందురం. అగ‌మ్య గోచ‌రం. కాంగ్రెస్ పాల‌న‌లో రైతులే కాదు దేశం, రాష్ట్ర‌మే స‌ర్వ‌నాశ‌నం అయింది. అభివృద్ధిలో వెనుక‌బ‌డింది. నాడు రైతులు, క‌రెంటు ప‌రిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఒక విజ‌న్ లేకుండా సాగిన ఆ పాల‌న వ‌ల్లే ప్ర‌జ‌లు, రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఇప్పుడు ఆ పార్టీ నేత‌లు మ‌ళ్ళీ అదే విధంగా మాట్లాడుతున్నారు. 3 గంట‌ల క‌రెంటు చాల‌ట‌.

1గంట పాటు ఇచ్చే క‌రెంటుతో ఎక‌రా భూమి పారుతుంద‌ట‌. రైతుల‌కు చేటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల మాట‌లు ఉన్నాయి. వారి మాట‌ల‌ను స‌మ‌ర్ధించే విధంగా ఆ పార్టీ వైఖ‌రి ఉంది. ఇలాంటి పార్టీ మ‌న‌కు అవ‌స‌ర‌మా? అంటూ నాటి ప‌రిస్థితుల‌ను మంత్రి రైతుల‌కు వివ‌రించారు. 3 పంట‌ల బిఆర్ ఎస్ కావాలా? 3 గంట‌ల క‌రెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? ప్ర‌జ‌లు, ప్ర‌త్యేకించి రైతులు తేల్చుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

కెసిఆర్ సీఎం అయ్యాకే రైతుల క‌ళ్ళ‌ల్లో ఆనందం
సిఎం కెసిఆర్ వ‌ల్లే రైతుల క‌ళ్ళ‌ల్లో అనందం వెల్లివిరిస్తున్న‌ది. దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాల అమ‌లు అవుతున్నాయి. రైతుల కోసం ఇంత‌గా చేసిన ప్ర‌భుత్వం గ‌తంలో లేదు. భ‌విష్య‌త్తులో రాదు. అని మంత్రి అన్నారు. సిఎం కెసిఆర్ రైతుల‌కు అనుకూల నిర్ణ‌యాలు, వ్య‌వ‌సాయానికి సాయం చేసే విధంగా ప‌థ‌కాలు రూపొందించి అమ‌ల చేస్తున్నందున ఇవ్వాళ దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు.

3 గంట‌ల విద్యుత్ చాల‌న్న రేవంత్ రెడ్డిని రైతులు నిల‌దీయాలి
ఇక కేవ‌లం 3 గంట‌ల క‌రెంటు చాల‌ని, రైతుల‌ను అవమాన ప‌ర‌చిన రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని రైతులు నిల‌దీయాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక వ్యాఖ్యలపై మండి పడ్డారు. తీవ్రంగా విమర్శించారు. తమ అనుభవాలను పంచుకున్నారు. కేవలం 3 గంటల పాటు కరెంటు చాలు అనడం అవగాహన రాహిత్యం అన్నారు. ఒక గంటలో ఒక ఎకరం పారడం కూడా సాధ్యం కాదన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నేత‌లు, స్థానిక ప్ర‌జాప్రతినిధులు, రైతు స‌మితి కోఆర్డినేట‌ర్లు, స‌భ్యులు, ప‌లువురు రైతులు, ప్ర‌త్యేకించి మ‌హిళా రైతులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE