Suryaa.co.in

Telangana

తెలంగాణాలో బిజెపికి కాంగ్రెస్ బీ-టీం

-రెండు పార్టీలు కలిపి లీకేజీ కుట్రలకు తెర లేపాయి
-నిరుద్యోగ శాతాన్ని పెంచింది ఆ రెండు పార్టీలదే
-అందుకు మూల్యం చెల్లించాల్సింది బిజెపి, కాంగ్రెస్ లే
-తొమ్మిదేళ్లలో లక్షా 32 వేల 649 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బి ఆర్ యస్ ది
-23 వేల మంది ఉద్యోగులను క్రమబద్దీకరించిన ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్
-ముఖ్యమంత్రి కేసిఆర్ నిప్పు..ముట్టుకుంటే భస్మమే
-ఆత్మీయ పలకరింపు లో మంత్రి జగదీష్ రెడ్డి
-కోదాడ లో బి ఆర్ యస్ ఆత్మీయ సమ్మేళనం
-అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్,ముఖ్య అతిదిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
-పాల్గొన్న శాసనమండలి చైర్మన్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,రాజ్యసభ సభ్యులు, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి, గాధరి కిశోర్ కుమార్,రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ తదితరులు

తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ బిజెపి కి బీ-టీం గా పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ వారసుడుగా రాహుల్ గాంధీని లోకసభ నుండి వెలి వేసి అక్రమంగా ఇంటిని ఖాళీ చేయిస్తే ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సోయి లేక పోగా బిజెపి ని అంటకాగి తిరుగుతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో లీకేజీ ల పర్వానికి తెర లేపాయన్నారు.వాస్తవానికి దేశంలో నిరుద్యోగ శాతాన్ని పెంచి పోషించిందే బిజెపి, కాంగ్రెస్ లని ఆయన దుయ్యబట్టారు.

అటువంటి పార్టీలు నిరుద్యోగులకు వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు.ఆదివారం కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ పురపాలక సంఘం పరిధిలో జరిగిన బి ఆర్ యస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు సూర్యపేట జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్,శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు లతో పాటు శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, గాధరి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ శాతాన్ని పెంచి పోషించిన కాంగ్రెస్,బిజెపి పార్టీలు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. బి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో లక్షా 32 వేల 649 ఉద్యగాలను భర్తీ చేశామన్నారు.ఏక కాలంలో 23 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని ఆయన కొనియాడారు. మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టంగానే లీకేజీ కుట్రలకు తెర లేపి నిరుద్యోగులలో గందరగోళం సృష్టించారని ఆయన మండిపడ్డారు.

90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వంగానే జిల్లా వ్యాప్తంగా బి ఆర్ యస్ పార్టీ శాసన సభ్యులు సొంత ఖర్చులతో ఆయా ఉద్యగాల అర్హతా పరీక్షల కోసమై శిక్షణా తరగతులు నిర్వహించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.2014 ఎన్నికల కు పూర్వం దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన మీదట ప్రతి సంవత్సరం రెండుకోట్ల ఉద్యగలను భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందాన్నారు. అదే ఎన్నికల ప్రచారంలో దేశంలో 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని అధికారంలోకి వచ్చిందే తడవుగా ఉద్యగాల భర్తీ ఉంటుందంటూ మాయ మాటలు చెప్పిన మోడీ నిరుద్యోగులను నిండా ముంచారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేసిన విదంగా కేంద్రం ఈ తొమ్మిదేళ్లలో సంవత్సరానికి రెండు కోట్లు చొప్పున భర్తీ చేసి ఉంటే తెలంగాణా నుండి ఇప్పటికే తొమ్మిది కోట్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవిగా అని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణా లో లక్షా 32 వేల 649 ఉద్యగాలను భర్తీ చేసినట్లు అధికారికంగా గణాంకాలు వెల్లడిస్తున్నామన్నారు.అదే విదంగా మాతో పాటు బిజెపి అధికారం లోకి వచ్చిన ఈ దేశం లోని అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కనీసం పది వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించారా అంటూ ఆయన బిజెపి నేతలను నిలదీశారు. అంతెందుకు 25 ఏళ్లుగా ఎక్కచత్రాది పత్యంగా బిజెపి ఎలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్ లో కనీసం లో కనీసం 30 వేల ఉద్యగాలను భర్తీ చేసినట్లు నిరూపిస్తారా అంటూ ఆయన బిజెపి కి సవాల్ విసిరారు.

గుజరాత్ సంగతి సరేసరి అంటూ ఆయన బిజెపి పై వ్యంగాస్త్రాలు సంధించారు.అటువంటి బిజెపి కి ఇక్కడి కాంగ్రెస్ బీ-టీం గా మారి లీకేజీల పర్వానికి తెర లేపిందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. పైగా దేశాన్ని బిజెపి మధ్య యుగంలోకి తీసుకు పోతుందా అన్న అనుమానాలు రేకిత్తిస్తున్నారని ఆయన చెప్పారు. శనివారం రాత్రి అటు మీడియా ఇటు పోలీసుల కళ్లెదుటే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఉదంతాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఉదహరించారు. అటువంటి బిజెపి, కాంగ్రెస్ లకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే వణుకు పుడుతుందని అందుకే లీకేజీ డ్రామాలకు తెర లేపి లబ్ది పొందే యత్నం చేస్తున్నాయాన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే నిప్పు కణిక అని ముట్టుకోవడం కాదు జోలికి వస్తేనే భస్మం అవుతారని మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్,బిజెపి లను హెచ్చరించారు.

LEAVE A RESPONSE