-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
కడప : మహిళా సాధికారతే అంతర్జాతీయ మహిళా దినోత్సవ లక్ష్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని తెలిపారు. అనిబిసెంట్, సరోజిని నాయుడు, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలుగా పని చేశారన్నారు. భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్, ప్రధానిగా ఇందిరా గాంధీ, లోక్ సభ స్పీకర్‌గా మీరా కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నత పదవులు అలంకరించారని అన్నారు.
కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు డ్వాక్రా పథకం, పావలా వడ్డీ రుణాలు, వడ్డీలేని రుణాలు, స్త్రీనిధి, అమ్మ హస్తం, అభయ హస్తం, బంగారు తల్లి తదితర పథకాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేశాయని చెప్పారు. వైసీపీ పాలనలో మహిళల పట్ల వివక్ష ఎక్కువ కావడం శోచనీయమని విమర్శించారు. మహిళా దినోత్సవం రోజునే అమరావతి మహిళల మీద దుశ్శాసన పర్వం జరగడం దురదృష్టకరమన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నైనా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని తులసిరెడ్డి తెలిపారు.