– బీ ఫార్మ్ లు లేని సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు ?
– బీజేపీ కాంగ్రెస్ లు కూడబలుక్కుని 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నారు
– 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్లడం బీసీ లను అవమాన పరచడమే
– కిషన్ రెడ్డి సైగ చేశారు..రేవంత్ రెడ్డి పాటించారు
– ప్రగల్భాలు పలికిన బీసీ సంఘాల నాయకులు ఇపుడు స్పందించాలి
– మాజీ మంత్రి వి .శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
హైదరాబాద్: కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ బీసీ లకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఏ హామీ ఇప్పటివరకు అమలు చేయలేదు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కు ఏదో చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకాలం నటించింది. జంతర్ మంతర్ దగ్గర ధర్నా తప్ప ప్రధాని ని సీఎం బీసీ రిజర్వేషన్ల పై కలిసింది లేదు. 42 శాతం ఇచ్చాకే ఎన్నికలకు వెళతామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇపుడు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు .ఇది నయవంచన ,మోసం కాదా? సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి.
బీ ఫార్మ్ లు లేని సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు ? కాంగ్రెస్ పప్పులో కాలేసింది. బీజేపీ కాంగ్రెస్ లు కూడబలుక్కుని 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నారు. కిషన్ రెడ్డి సైగ చేశారు .రేవంత్ రెడ్డి పాటించారు. 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్లడం బీసీ లను అవమాన పరచడమే. బరి తెగించి కాంగ్రెస్ బీసీ లను మోసం చేస్తోంది.
బీసీ లను బానిసలు చేయడమే కాంగ్రెస్ ఉద్దేశం. ప్రగల్భాలు పలికిన బీసీ సంఘాల నాయకులు ఇపుడు స్పందించాలి. బీసీ విద్యార్థులకు ఫీ రీఇంబర్స్ మెంట్ రాకున్నా ఎవ్వరూ మాట్లాడటం లేదు. బీసీ ల చెవుల్లో కాంగ్రెస్ పూలు పెట్టింది. బీసీ లను కాంగ్రెస్ బీజేపీ జోకర్లుగా చూస్తున్నాయి. 3 వేల కోట్ల నిధులకోసం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఆపడం సమంజసమా ? పెద్ద పెద్ద ప్రాజెక్టు లకు నిధులు ఆపి గ్రామాలకు 3 వేల కోట్లు నిధులు ఆపలేరా ? కాంగ్రెస్ బీజేపీ ల్లోని బీసీ లు 42 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి.
బీసీ సంఘాలన్నీ ఏక తాటి పైకి రావాలి. కాంగ్రెస్ మోసాల్ని ఎండగడుతాం. బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి వాటిని తగ్గిస్తే మోసం చేసినట్టు కాదా ? బీసీ ల జే ఏ సీ మీటింగ్ రేపే నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తాం. జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితం వేరు -గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు వేరు. గ్రామాలన్నీ ఉడుకుతన్నాయి .ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు బుద్ది చెబుతారు. స్థానిక సంస్థల్లోనే 42 శాతం రిజర్వేషన్లు కాదు .చట్ట సభల్లో కూడా బీసీ లకు రిజర్వేషన్లు కావాలి.
పార్టీ పరంగా రిజర్వేషన్లు చట్ట సమ్మతం కావు :మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లతో పంచాయతీల స్థానాలు ఖరారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పడం దుర్మార్గం. 42 శాతం నుంచి 23 శాతానికి బీసీ రిజర్వేషన్లు పడిపోతాయి. పార్టీ పరంగా రిజర్వేషన్లు చట్ట సమ్మతం కావు. 50 శాతం లోబడి రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయం బీసీ లకు మోసం చేయడమే. బీసీ సంఘాలన్నీ సంఘటితమై చట్టబద్దమైన 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి. బీసీ లకు రావాల్సిన రిజర్వేషన్ల కోసం బీ ఆర్ ఎస్ పోరాడుతుంది. ప్రెస్ మీట్ లో సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్ పాల్గొన్నారు.