– భూములు అమ్మేటప్పుడూ ప్రజాభిప్రాయం అవసరం
– ఎనిమిది క్లస్టర్లలో పర్యటిస్తాం
– శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం హిల్ట్ -పి పేరిట పాలసీ తెచ్చింది. ఇందుకోసం జీవో విడుదల చేశారు. దాదాపు పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే ఈ పాలసీ తెచ్చారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేసీఆర్ హయంలో పరిశ్రమల స్థాపనకు టీ ఎస్ ఐ పాస్ తెచ్చి పదిహేను రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసం హిల్ట్ పాలసీ తెచ్చింది. పరిశ్రమలకు భూములు ఇచ్చేటపుడే కాదు అమ్మేపుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకోవాలి. సోషల్ ఇంపాక్ట్ స్టడీస్ చేయాలి. మంత్రి శ్రీధర్ బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదు అని చెబుతున్నారు. జీవోలో మాత్రం తొమ్మిది వేల ఎకరాల పైనే ప్రస్తావించారు.
బీఆర్ ఎస్ పాలనలో ఇలాంటి జీవోలు ఎపుడూ ఇవ్వలేదు. పారదర్శకమైన విధానం అమలు చేశాం. వ్యవసాయ రంగం తో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎట్లా?
ఓ ఆర్ ఆర్ అవతలకు పరిశ్రమలు స్థాపింవే అవకాశం పారిశ్రామిక వేత్తలకు కల్పించాలి. బిడ్డింగ్ ద్వారా ఉపయోగం లో లేని పరిశ్రమల భూములను అమ్మాలి. చాలా రాష్ట్రాల్లో ఈ పద్ధతి అమలు అవుతోంది హిల్ట్ పాలసీ రావడానికి వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయి. అనేది మా ప్రధాన ఆరోపణ. ఫ్యూచర్ సిటీ లో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదు. ఫిలిం యూనిట్లపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదు. టీ ఎస్ ఐ పాస్ ద్వారా కొత్తగా ఎన్నో పరిశ్రమలు తెచ్చి పదేళ్ల కేసీఆర్ పాలన లో 18 లక్షల మందికి ప్రైవేట్ రంగం లో ఉద్యోగ అవకాశాలు కల్పించాం.
హిల్ట్ పాలసీ రద్దు చేసి పారిశ్రామిక భూములు వేలం వేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. హిల్ట్ కు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళతాం. ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఎనిమిది నిజనిర్ధారణ బృందాలను పార్టీ నియమించింది. కే టీ ఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు ఈ బృందాలకు నేతృత్వం వహించి వేర్వేరు క్లస్టర్ల లో పర్యటిస్తారు.
ఎనిమిది క్లస్టర్లలో మా నేతల బృందం రేపు, ఎల్లుండి పర్యటించి నిజాలు నిర్ధారించడం తో పాటు భూముల ధరలు నిర్ధారిస్తుంది. బీజేపీ నేతలు కూడా ఆలస్యంగానైనా హిల్ట్ పై మేల్కొన్నందుకు సంతోషమే. ఐదు లక్షల కోట్ల రూపాయల భూ కుంభ కోణం పై గవర్నర్ కూడా స్పందించాలి.
పర్యావరణ వేత్తలు కూడా స్పందించాలి. మా నిజనిర్దారణ బృందాల పర్యటనల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిలువు దోపిడీ ని అరికట్టి తీరుతాం. ప్రభుత్వం భూములను కారు చౌకగా కట్టబెడితే పేదల ఇండ్లకు, ఆస్పత్రులకు, పార్కులకు, శ్మశాన వాటికలకు భూములు ఎక్కడ్నుంచి తెస్తారు?
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ…
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారు. విలువైన భూములు ప్రభుత్వ సంపద. ఈ సంపదను హిల్ట్ పేరుతో సీఎం, ఆయన ఆత్మీయులు కొల్లగొట్టే ప్రణాళిక వేశారు. హైదరాబాద్ నడి బొడ్డున ఇంత విలువైన సంపద దోచుకుంటే మేధావులు మౌనంగా ఉండటం సమంజసం కాదు.
కేసీఆర్ ది గడీల పాలన అన్న మేధావుల నోర్లు ఇపుడు ఎందుకు మూగబోయాయి? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రేవంత్ అంతటి అవినీతికి పాల్పడ్డారా? ఎందరు సీఎంతో కుమ్మక్కయినా హిల్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు.
జైళ్లకు కేసులకు కూడా మేము వెనుకాడం. వచ్చేది మా ప్రభుత్వమే… హిల్ట్ లో భాగం పంచుకున్నఎవ్వరినీ వదిలిపెట్టం. మా పర్యటనల ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ భూ దందాలు వివరిస్తాం.
మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేక సొంత సంపాదన మీద దృష్టి పెట్టారు. భూ దందాలతో దోచుకో దాచుకో అనే విధానం పైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. బీసీ లతో సహా అందరిని మోసం చేసిన చరిత్ర రేవంత్ ది. హిల్ట్ పై ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదు