Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి ప్రత్యేక హోదాని ఇచ్చేది కాంగ్రెస్సే

-పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాని ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆనాడు పార్లమెంట్ సాక్షిగా మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ,సోనియా గాంధీ హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుందని రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు.

ఆయన విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బిజెపికి వత్తాసు పలికే పార్టీలన్నింటికీ త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. దళిత నాయకుడు,మహోన్నత వ్యక్తి, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్కే గారికి కోర్టు సమన్లు ఇవ్వడం, పరువు నష్టం దావా వేసి జులై 10న విచారణకు రావాలని ఆదేశించడం బిజెపి యొక్క దుర్మార్గపు చర్యగా ఆయన విమర్శించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఆదరించారని ఆయన అన్నారు. అలాగే దేశమంతా ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తుంది అని ఆయన చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి,వైఎస్ఆర్సిపి, ఒక కూటమిగా ఏర్పడి ఇవన్నీ బిజెపికి తొత్తులే అని ఖరాకండిగా తేల్చి చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, దనేకుల మురళి, మీసాల రాజేశ్వరరావు, కొర్రి వినయ్ కుమార్, కొలనుకొండ శివాజీ, కొమ్మినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE