-దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలి
-పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళనలు సరికాదు.
-మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
డిసెంబరు 13న పార్లమెంటులో నిందితులు కలర్ స్ప్రే అటాక్ చేశారు. రెండు దశాబ్ధాల క్రితం అదే రోజున పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఈ రెండు ఘటనల్లో కుట్రకోణం దాగి ఉంది. ఇందులో పాత్రదారులు, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలని స్పీకర్ గారు దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కొంతమంది కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.
పార్లమెంటులో దాడి ఘటనపై దర్యాప్తు సంస్థల నివేదిక వస్తుంది. నిందితులు.. తాము వాడిన ఫోన్లను పగులగొట్టి.. దర్యాప్తు సంస్థలకు ఆధారాలు దొరక్కుండా చేశారు. ఇటీవల శాసన సభ కు జరిగిన రాష్ట్రాల్లో ఘోర ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. నిజాలు బయటకు రాకూడదన్న భయంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో రభస చేస్తోంది అన్న భావన కలుగుతోంది.
పాత్రదారులు, కుట్ర దారులు ఎవరనేది త్వరలో తెలుస్తుంది. దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలి. పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళనలు సరికాదు. ప్రజాస్వామ్య విలువలకు నిలయమైన పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీయకుండా.. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేలా దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం జరిగింది.
అలాగే కరోనా వేరియంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు భయాందోళన చెందవద్దు.జేఎన్- 1 వేరియంట్ పై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళు ఇంటికే పరిమితం కావాలి.కొత్త వేరియంట్ పై ఆందోళన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండాలి.ప్రజల మధ్యకు వెల్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిచిన వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోంది.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి.తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అందరూ సహకరించాలని కోరుతున్నా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేస్తున్నాను.