– లా అండ్ ఆర్డర్ లా పతా అయింది
– షీ టీం లు ఎక్కడ ఉన్నాయి ?
– పోలీసులను సీఎం ఫోటో గ్రాఫర్లు, బిల్ కలెక్టర్లుగా మార్చారు
– రేవంత్ పోలీసులకు హామీ ఇచ్చిన ఏక్ పోలీస్ విధానం ఏమైంది ?
– పోలీస్ లకు ఆరోగ్య భరోసా ఎక్కడా అమలు కావడం లేదు.
– బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: రాష్ట్రమంతా అవినీతిమయం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ ,క్రైమ్ గా మారింది. రెండు సంవత్సరాల రేవంత్ పాలన లో రాష్ట్రం క్రైమ్ కు చిరునామా గా మారింది. కేసీఆర్ హయం లో తెలంగాణ అంటే శాంతికి చిరునామా. లా అండ్ ఆర్డర్ లా పతా అయింది. హోమ్ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పెరుగుతున్న క్రైమ్ రేట్ కు భాద్యత వహించాలి.
కేసీఆర్ హయం లో ఉన్న అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది. పట్టపగలు నడి రోడ్డు ఫై హత్యలు పెరిగిపోయాయి. 2023 తో పోలిస్తే క్రైం రేటు 14 శాతం పెరిగింది. 2025 లో వెయ్యి మర్డర్లు జరిగాయి. పెట్టుబడులు పెట్టే వారు లా అండ్ ఆర్డర్ ను చూసి పారిపోతున్నారు. సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగింది.
నాడు తెలంగాణ శాంతిభద్రతలకు ఆదర్శం. నేడు సైబర్ క్రైమ్ లకు అడ్డా గా మారింది. బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా పై కేసులు పెట్టడం లో ఉన్న శ్రద్ధ నేరాల అదుపు లో పెట్టి ఉంటే రాష్ట్రం లో శాంతి ఉండేది. రాష్ట్రాన్ని వల్ల కాడు లా మారుస్తోoది కాంగ్రెస్ పార్టీ. ఫుట్ బాల్ ఆడటం లో సమిట్ లు నిర్వహించడం లో సీఎం బిజీ గా ఉన్నారు. శాంతి భద్రతలు కాపాడటం లో ఆయనకు శ్రద్ధ లేదు. ఫ్రెండ్లీ పోలీస్ పోయి వేధించే పోలీస్ అయ్యింది.
షీ టీం లు ఎక్కడ ఉన్నాయి ?మహిళల పై వేధింపులు ఎక్కువయ్యాయి. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలీస్ శాఖ లో అసమర్దుల కు కీలక పదవులు ఇవ్వడం వల్లే నేరాల సంఖ్య పెరుగుతోంది. నేరాల సంఖ్య 90 వేలను దాటింది. ప్రజలను హతమార్చడం తప్ప రాష్ట్రం లో ప్రజాపాలన లేదు. పోలీసులను సీఎం ఫోటో గ్రాఫర్లు ,బిల్ కలెక్టర్లుగా మార్చారు. రోజుకు 30 ఫోటోలు తీయాలి 30 చలాన్లు రాయాలి అనేది పోలీసుల పాలసీ గా మారింది
పోలీసులను ఫోటో గ్రాఫర్లు ,బిల్ కలెక్టర్లుగా మార్చేది ఉంటే వారికి రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ టెస్టులు ఎందుకు? దేశం లో ఆదర్శంగా ఉన్న తెలంగాణ పోలీస్ నేడు అద్వాన్నంగా మారింది. చలానాల పేరు తో పేద మధ్యతరగతి ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ఎక్సయిజ్ శాఖ కు ఓ వైపు టార్గెట్లు పెడుతూ ..మరో వైపు 24 గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడుతున్నారు. ఒకే ప్రభుత్వం రెండు విధానాలతో ముందుకు పోతోంది. రేవంత్ పోలీసులకు హామీ ఇచ్చిన ఏక్ పోలీస్ విధానం ఏమైంది ? పోలీస్ లకు ఆరోగ్య భరోసా ఎక్కడా అమలు కావడం లేదు.
గ్లోబల్ సమిట్ గోబెల్స్ సమిట్ గా మారింది. శాంతి భద్రతల పరిరక్షణ లో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణ పై దృష్టి సారించాలి. నేరాల సంఖ్య ను ప్రభుత్వం నియంత్రించక పోతే బీ ఆర్ ఎస్ ఆందోళనా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది.
ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ నేతలు కె .కిషోర్ గౌడ్ , ఇంతియాజ్ అహ్మద్ ,గోసుల శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్ గౌతమ్ ప్రసాద్, సత్యవతి పాల్గొన్నారు.