తులసీ రెడ్డి
మరో దండి యాత్ర, మరో క్విట్ ఇండియా ఉద్యమం కాబోతున్న భారత్ జోడో యాత్ర. దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం నాటి బ్రిటిష్ దుష్ట పాలనకు చరమగీతం పాడాయి. నేటి భారత్ జోడో యాత్ర తో బిజెపి దుష్ట పాలన నుండి దేశానికి, వైకాపా దుష్ట పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యం.భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7 నుంచి 148 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 68 లోక్ సభ స్థానాలు, 203 అసెంబ్లీ స్థానాల మీదుగా 3571 కిలోమీటర్లు దూరం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగుతుంది.
ఆంధ్రప్రదేశలో 4 రోజుల పాటు రాయదుర్గం, ఆలూరు, ఆదోని, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 100 కిలోమీటర్లు సాగుతుంది. ఈ యాత్రను జయప్రదం చేయటం కోసం రాష్ట్ర సమన్వయకర్త గా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డీ తులసి రెడ్డిని నియమించడమైంది. ఇప్పటికే జిల్లా సమన్వయకర్త లను, జిల్లా శిక్షకులను నియమించడమైంది. కంట్రోల్, సబ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేయడమైంది. త్వరలో శారీరక దారుఢ్యం కలిగి రోజుకు 25 కిలోమీటర్లు నడవగలిగే అంకిత భావం ఉన్న 100 నుంచి 150 మందిని ప్రదేశ్ యాత్రికులుగా ఎంపిక చేయడం జరుగుతుంది. పాద యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిర్ణీత సమయాలలో, ప్రదేశాల్లో అటు ప్రజలను, ఇటు కాంగ్రెస్ శ్రేణులను కలుసుకుంటారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని ఫలప్రదం, శుభప్రదం, జయప్రదం చేయాలని విజ్ఞప్తి