-పాలకుర్తి నియోజకవర్గం మాటేడు గ్రామంలో టీఆర్ఎస్ లో విలీనమైన కాంగ్రెస్.. విలవిలలాడుతున్న బిజెపి
-బిజెపితో ఒరిగేది ఏమీ లేదు… బిఆర్ఎస్ తోనే అభివృద్ధి
-కాంగ్రెస్ ఖతం అయింది.. భవిష్యత్తు భారత రాష్ట్ర సమితిదే
-బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కండువాలు కప్పి ఆహ్వానం పలికిన మంత్రి -ఎర్రబెల్లి దయాకర్ రావు
(పాలకుర్తి ): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయిందని, మా చేరికలతో ఖాళీ అయిందని పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్ మండలం, మాటేడు గ్రామ సర్పంచి వల్లపు శోభా – యాకయ్య, ఉప సర్పంచ్ పినాక పాణి, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు చెబుతూ టిఆర్ఎస్ పార్టీలోకి రాగా.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి కండువాలు కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం కలిపారు.
బిజెపితో ఈ రాష్ట్రానికి, మా గ్రామానికి ఒరిగేదేమీ లేదని టిఆర్ఎస్ పార్టీతోటే అభివృద్ధి జరుగుతుందని నమ్మి భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నామంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నాయకత్వంలో మాటేడు బిజెపి నాయకులు, కార్యకర్తలు నేడు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజేపి నేతలు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి మంత్రి వారికి ఆహ్వానం పలికారు. ఒకే రోజు బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటాపోటీగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నేతృత్వంలోమండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు ప్రోద్బలంతో మాటేడు గ్రామంలో నేడు భారీ చేరికలు జరిగాయి.
బిఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాటేడు గ్రామ అభివృద్ధి, సంక్షేమం ఈ చేరికలతో మరింత వేగవంతం అవుతుందని హామీ ఇచ్చారు.
కొత్తగా వచ్చిన వారిని కలుపుకునిపోయే బాధ్యత తనదని చెప్పారు.
మాటేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని.. ఆ పార్టీ రాష్ట్రంలో ఖతమైందని బిజెపి పార్టీ డీలాపడిందని, బిజెపి పార్టీ వల్ల ఒరిగేది ఏమీ లేదని ప్రజలు తెలుసుకోవడం సంతోషకరమని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన చేరికల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరినీ అభినందిస్తున్నాను.బీజేపీ నుంచి లింగాల వెంకన్న గారు, నాయకులు, కార్యకర్తలు బి.ఆర్.ఎస్ లో చేరడాన్ని ఆహ్వానిస్తున్నా.కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచి శోభ – యాకయ్య ఉపసర్పంచి పినాక పాణి, ముఖ్య నాయకులు లేగల వెంకటరెడ్డి, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కార్యకర్తలు చేయడం పట్ల అభినందిస్తున్నాను.మనకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి ఏమి చేశారు అనేది మనం ఆలోచించాలి.
కేసిఆర్ అమలు చేసినన్ని స్కీమ్స్ ఎవరూ దేశంలోనే ఎవరూ అమలు చేయడం లేదు.అన్ని ఒకేసారి కావాలి అంటే భగవంతుని వల్ల కూడా కాదు. ఎన్నో చేస్తున్నా కొంతమంది మూర్ఖులు ఇంకా ఏమి చేశారు అని అంటూనే ఉంటారు.పెన్షన్లు మహానుభావులు ఎన్టీ రామారావు గారు పెట్టారు. సీఎం కేసీఆర్ గారు ఆ పెన్షన్లు 2000 రూపాయలు చేశారు.ఇంకా పెన్షన్లు రాని వారికి ఇప్పించే బాధ్యత నాది.
దేశంలో మన దగ్గర తప్ప ఎక్కడైనా 500 రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు.ముసళ్లోల్లకు గౌరవం వచ్చింది సీఎం కేసీఆర్ వల్లే. నేను ఈ ఊరికి మొదట్లో వచ్చినపుడు గ్రామం చెరువులోకి నీరు తెస్తే చాలు అన్నారు.ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వద్దంటే నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చాక వ్యవసాయం బాగు పడ్డది.75 ఏళ్లు కరెంట్ కోసం కొట్లాడాం.బిజెపి దొంగ ప్రభుత్వం.ఆ ప్రభుత్వం వల్లే దేశం నాశనం అవుతుంది.కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టమని బలవంతం చేస్తున్నారు. కానీ నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనని సీఎం కేసీఆర్ గారు తెగేసి చెప్పారు. రైతులంటే సీఎం కేసీఆర్ గారికి అంత ఇష్టం. మేనమామ వలె కళ్యాణ లక్ష్మి పథకం కింద పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నారు.
ర్భిణీలు డెలివరీ అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో కేసిఆర్ కిట్ ఇచ్చి అబ్బాయి పుడితే 12వేలు, అమ్మాయి పుడితే 13వేలు ఇస్తున్నారు.రాష్ట్రంలో కేసిఆర్ గారు, మంత్రి, ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు అనే కాంగ్రెస్, బీజేపీల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో బి.ఆర్.ఎస్ లో చేరుతున్నారు.గ్రామం ఏకతాటి మీద ఉండండి. కలిసి పని చేయండి. అందరితో కలిపి కమిటీ వేస్తాను. కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ది చేద్దాం.
ఈ గ్రామంలో తెలంగాణ వచ్చాక 594 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఊరిలో సగం మందికి అన్నట్టు. నెలకు 14 లక్షలు..ఏటా కోటి 66 లక్షలు ఈ గ్రామానికి వస్తున్నాయి.రైతు బంధు కింద 1171 మందికి పెట్టుబడి డబ్బులు వస్తున్నాయి. ఏటా 2 కోట్ల 50 లక్షల రూపాయలు వస్తున్నాయి.10 కోట్ల 82 లక్షల రూపాయలు కేవలం రైతు బంధు కింద ఈ గ్రామానికి వచ్చాయి.
13 మందికి రైతు బీమా వచ్చింది. 65 లక్షలు వచ్చాయి.కళ్యాణ లక్ష్మి పథకం ఈ ఒక్క ఏడాది 130 మందికి డబ్బులు వచ్చాయి. కోటి 30 లక్షలు వారి అకౌంట్లలో పడ్డాయి.డెలివరి కోసం కేసిఆర్ కిట్ కింద 26 లక్షల రూపాయలు వచ్చాయి.మిషన్ భగీరథ కోసం ఈ గ్రామానికి కోటి రూపాయలు ఖర్చు చేశాం.60 లక్షల రూపాయలతో కొత్త రోడ్డు పెట్టాం.సిమెంట్ రోడ్లు 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి వేశాం.ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేశాను.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చాను. ఇంకా ఇస్తాను. పార్టీలో పాత, కొత్త లేదు..అందరు కలిసి ఉండాలి. మిమ్మల్ని కాపాడుకుంటాను.సర్పంచ్ లింగాల వెంకన్నతో పాటు లింగాల ధనమ్మ, ఓరుగంటి శీను, శారద, లింగాల దక్షిణామూర్తి, హైమ, భీమయ్య చారి, వసంత, సిద్దయ్య చారి వీరితోపాటు పదుల సంఖ్యలో చేరారు. వీరితోపాటు తొర్రూరు మండలం సోమవరపుకుంట తండాలో 25 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కండువాలు కప్పి వారికి ఆహ్వానం పలికారు.