– తెలంగాణ మోడల్ అనే పేరుతో కాంగ్రెస్ మోసం
– రాష్ట్ర సంపద, నీటి వనరులు, నిధుల వినియోగం గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు?
– ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుండి 524 అడుగులు పెంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు?
– మతపరమైన రిజర్వేషన్లు పక్కన పెట్టి, 42% బీసీలకే ఇవ్వాలి
– స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భ్యర్థులకు 42% కంటే ఎక్కువగా 45% రిజర్వేషన్
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్
హైదరాబాద్: బీహార్ ఎన్నికల సందర్భంలో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ రోల్ మోడల్ అంశంపై చర్చించారు. వారు ఈ “తెలంగాణ మోడల్”ను బీహార్ లో, దేశంలో విస్తరించాలంటూ చెబుతున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే… కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మోడల్ అనే పేరుతో ప్రజలను మోసం చేస్తోంది..
రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 22 నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలన చేస్తోంది.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం F3 – Fake, Failed & Fraud Promises మాత్రమే చేస్తోంది:
Fake Promises: వాగ్దానాలు చేస్తుంది, కానీ వాటిని అమలు చేయదు.
Failed Promises:హామీలు ఇస్తుంది. అమలు మాత్రం శూన్యం..
Fraud Promises: ప్రజలను మోసం చేస్తూ, వారి గౌరవం, హక్కులను దొంగిలిస్తోంది..
బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ ప్రజలను మోసం చేశాయి. ప్రజలకు వాగ్దానాలు, హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేదు.. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, ఉద్యమకారులకు చెబుతున్న మాటలివే.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు పెద్ద హామీలతో ప్రాచారం చేశారు: “తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వస్తే అన్ని హామీలు ఫుల్ ఫిల్ చేస్తాం” అని అన్నారు. కానీ ఈ హామీలు ప్రజల కోసం నెరవేరలేదు.
ఇదే విధమైన పరిస్థితి కర్ణాటకలో కూడా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొస్తామని అనేకసార్లు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ఏ ఒక్క ఇండస్ట్రీ, ఫ్యాక్టరీ లేదా ఉద్యోగసృష్టి చేయకుండా వైఫల్యం చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో ఎన్ని సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి, వాటి వివరాలు శ్వేతపత్రం విడుదల చేయాలి..
తెలంగాణ రోల్ మోడల్ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర సంపద, నీటి వనరులు, నిధుల వినియోగం గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుండి 524 అడుగులు పెంచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు?
హైకోర్టు కూడా మొట్టికాయలు వేసి సెప్టెంబరు 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఆదేశించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చర్యలు తీసుకోలేదు. ఫలితంగా పంచాయతీల్లో పాలన లేక పూర్తిగా స్తంభించిపోయాయి. కనీసం బతుకమ్మ సంబరాలు కూడా గ్రామపంచాయతీలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.
గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తమైంది. గుంతలు పూడ్చేవారు లేరు, చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి రూ. 1500–2000 కోట్ల నిధులు డైరెక్ట్‌గా వస్తాయి, కాని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.3,500 వేల కోట్ల రూపాయలు ఆగిపోయాయి. ఇంత దరిద్రమైన పాలన ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.
ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ 100% పారదర్శకంగా, చట్టబద్ధతతో అమలు చేయాలి. మతపరమైన రిజర్వేషన్లు పక్కన పెట్టి, 42% బీసీలకే ఇవ్వాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు 42% కంటే ఎక్కువగా 45% రిజర్వేషన్ కల్పించనుంది.
ఈ జీవో అమలు లీక్స్, షార్ట్ ఫాల్స్ లేకుండా, ఫుల్ ప్రూఫ్ విధానంలో చేయడం అవసరం. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపట నిర్వహించాలి, దీనికి కోర్ట్ జోక్యం అవసరం లేకుండా పూర్తి చేయాలి.
బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖలో నూతన పదాధికారుల నియామకం జరిగింది.. అందులో భాగంగా, నాకు బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన ఈ సందర్భంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు , కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.
రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మావంతు కృషి చేస్తాం. ఈ క్రమంలో మీడియా సహకారం రాబోయే కాలంలో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను.