-ఆయుష్మాన్ కి ఆదర్శం ఆరోగ్యశ్రీ
-ఏపీసీసీ అధ్యక్షురాలు చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి
అమరావతి: ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్రమంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతిఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు.
ఈ సందర్బంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ… ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అంటే ఆరోగ్యశ్రీ ని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందని, అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారాణి ప్రశ్నించారు. బిల్లులు చెల్లించే ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం అన్నారు. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమి లేదా అన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారు.
ఆయుష్మాన్ కి ఆదర్శం ఆరోగ్యశ్రీ
గత వైకాపా ప్రభుత్వం 16 వందల కోట్లు బకాయిలు పెడింగ్ లో పెడితే, ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగ పెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలి. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన అద్భుత పథకం.పేద కుటుంబాలకు పునర్జన్మ ఇచ్చిన పథకం. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే. ఇలాంటి పథకాన్ని నీరు గార్చాలని చూస్తే సహించం. ఆరోగ్యశ్రీ పై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న 16 వందల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు.