– 10% రిజర్వేషన్లను బీసీల కోటాలో ముస్లింలకు కలిపేందుకు కుట్ర
– ఓబీసీ మోర్చా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లలో ముస్లిం రిజర్వేషన్ల ‘పరకాయ ప్రవేశం’ చేయించే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా, బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే కుట్రకు పాల్పడుతున్నారు.
చందమామ బాలమిత్ర కథల్లో చదువుకున్న పరకాయ ప్రవేశం మాదిరిగా.. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విధానాలు కనపడుతున్నాయి. కోర్టులో ఇప్పటికే 4% ముస్లింల రిజర్వేషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో, బీసీలకు 42% రిజర్వేషన్లు అని ప్రకటిస్తూ… అదే సమయంలో మైనారిటీ హోదాలో నడుస్తున్న 204 గురుకులాల నేపథ్యంలో, ఆ 10% రిజర్వేషన్లను బీసీల కోటాలో ముస్లింలకు కలిపేందుకు కుట్ర పన్నారు.
రేవంత్ రెడ్డి గతంలో బీసీల పరిపాలన సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సుదీర్ఘ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలించిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయలేదు. ఆనాడు కాకా కలేల్కర్ కమిషన్ సిఫార్సులను, తర్వాతి కాలంలో మండల్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది.
బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్లను కల్పించిన చారిత్రక ఘట్టం మాత్రం బిజెపి మద్దతుతో ఏర్పడిన వీపీ సింగ్ ప్రభుత్వ కాలంలోనే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు 10% కలిపే ప్రయత్నం చేయడం మోసం, దగా. బీసీలు ఈ కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి సమాధానం చెబుతారు?