Suryaa.co.in

Andhra Pradesh

భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం

-మన రాజ్యాంగం చాలా పటిష్టమైనది
-చట్టబద్దంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలి
-గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.

తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం వందన సమర్పణ చేశారు..అనంతరం ఆయన ఈ కర్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… స్వతంత్ర సమరయోధులు, మేధావులు, అంబేద్కర్ లాంటి మహనీయుల మార్గదర్శకత్వంలో రూపొందిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి ఇప్పటికీ మార్గదర్శకముగా నిలబడి ఉందని ఆయన చెప్పారు.

తరువాత కాలక్రమేనా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు.. భారత రాజ్యాంగం ఒక పవిత్రమైన గ్రంథం….. దాన్ని అంత పటిష్టంగా రూపొందించారు కనుకనే ఈరోజు కూడా దేశ సమగ్రతకు భంగం ఏమాత్రం కలగకుండా కొనసాగుతోందని అన్నారు..

LEAVE A RESPONSE