October 3, 2026

కల్పించబడ్డ (contrived) మహాత్ములు

కల్పించబడ్డ (contrived) మహాత్ములు మనదేశ చరిత్రలో ఉన్నారు; రూపొందించబడ్డ మహాత్ముల్ని చరిత్ర మనకు చూపించింది. కల్పించబడ్డ, రూపొందించబడ్డ మహాత్ముల వల్ల దేశానికి, దేశ ప్రజలకు దీర్ఘకాలిక కీడు జరుగుతూంటుంది. అలాంటి కీడు పెద్ద ఎత్తున మనదేశానికి జరిగింది; జరుగుతోంది.

సహజమైన, నిజమైన మహాత్ములూ చరిత్రలో ఉన్నారు. సహజమైన, నిజమైన మహాత్ములు గతించిపోయాక కూడా వాళ్ల మేధ వల్ల, వాళ్లు చేసిన, చెప్పిన వాటివల్ల తరతరాలకూ మేలు జరుగతూ ఉంటుంది.

కీడుకు మేలుకు ఉన్న తేడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

మాహాత్మ్యం అన్నది, మహాత్ములు అన్నది మనోభావం కాదు; కాకూడదు. మాహాత్మ్యం, మహాత్ములు క్షేత్ర వాస్తవ పరిణామాల వల్ల నిర్ధారణ అవాలి.

మానసిక బానిసత్వం, మధ్యతరగతి జాడ్యం, చింతన దోషం, మోసపోయే నైజం, తెలివిడి లేకపోవడం,
బుద్ధి మాంద్యం దట్టంగా నెలకొని ఉండడం వల్ల మన దేశంలో మహాత్ములు రూపొందించబడ్డారు.

రూపొందిచబడ్డ అబద్ధాన్ని నమ్మి దాన్ని మనోభావంగా మింగితే అది అజీర్ణమై వ్యాధి ఔతుంది. ఆ వ్యాధి ఇవాళ మనదేశంలో మననం చేసుకోబడుతూ ఉంది; వల్లె వేసుకోబడుతోంది!

ఏ వ్యాధి ఐనా తొలగిపోవాలి; లేకపోతే మనం మనకు కాకుండా పోతాం. కొన్ని వ్యాధులు మనకు తీవ్రమైన కీడు చేస్తాయి. కీడు జరిగాక కూడా, కీడు జరుగుతున్నా కూడా మనం వ్యాధికి వైద్యం చేసుకోపోడం నేరం.

వ్యాధిని స్మరించుకోవడం కాదు వ్యాధికి వైద్యం చేసుకోవడం అత్యవసరం.
ఇవాళ వ్యాధిని స్మరించుకోవడం కాదు రేపటికైనా వ్యాధిని నయం చేసుకుని మనం ఆరోగ్యవంతులం కావాలి.
ఆలోచిద్దాం…

రూపొందించబడ్డ మహాత్ముల్ని ఇంకా మహాత్ములు అనుకుంటూ ఉండడం, మానసిక రోగుల్ని మహాత్ములు అనుకుంటూ ఉండడం ఒక వ్యాధిగా మనలో ఉంది. ఆ వ్యాధిని మనం నయం చేసుకోవాలి.

పోయిన వాళ్లు అందరూ మంచివాళ్లు, ఉన్నతమైన వాళ్లు, మహాత్ములు అయిపోతారా? హిట్లర్ కూడా పోయిన వాడే కదా? హిట్లర్ మహాత్ముడు కాడు. ఒక మనిషి మరణించడమే అతణ్ణి మంచివాణ్ణి చేసేస్తుందా?

పోయిన వాళ్ల చెడ్డతనం గురించి, చెడు చేసి పోయిన వాళ్ల గురించి ఆలోచన, అవగాహన అవసరం.
అనుకోవాడాన్ని తెలివిడి అని, అభిప్రాయాన్ని అవగాహన అని బతుకుతున్న మధ్యతరగతి మాంద్యం వల్ల సమాజానికి కీడే జరుగుతుంది; కీడే జరిగింది; జరుగుతోంది.

కీడును మేలుగా స్మరించుకుంటూ ఉండడం కాదు మనో వికాసంతో కీడు నుంచి బయటపడి మేలులోకి వెళ్లాలి; మనమూ, దేశమూ ఆరోగ్యంగా అభివృద్ధితో విలసిల్లాలి.

  • రోచిష్మాన్
    9444012279
Total Visitors: 2,855,245