Suryaa.co.in

Andhra Pradesh

దేవుడా నీకు దిక్కెవరు?

నీ ఆస్తులు, నీ సొమ్ములు కాపాడుకోలేవా?
అవినీతి అధికారులకు అందలమా?
దేవాదాయ శాఖలో అవినీతి అధికారులు
ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ అవినీతి అధికారులకు పదోన్నతులు..
దేవదాయ శాఖ లో అవినీతి త్రిమింగ్లాల ను పట్టుకుంటున్న ఏసీబీ అధికారులు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు పదోన్నతులు

2017 వ సంవత్సరంలో రాజమహేంద్రవరం ప్రాంతీయ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఆజాద్, డిసెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు.. ఆయన దగ్గర నుంచి బంధువుల వద్ద నుంచి భారీ మొత్తంలో ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారి బంధువులే కాకుండా వారి సోదరుడు దగ్గర కూడా, సుమారు 50 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అప్పట్లో ఏసీబీ అధికారులు ధృవీకరించారు.

ఏసీబీ అధికారుల్లో పట్టుబడిన అధికారికి.. ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి పదోన్నతి కల్పించకూడదు అన్న ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉంది. కానీ కొంత మంది ఉన్నతాధికారులు వారికి పదోన్నతులు కల్పిస్తూ, ఇంకా అక్రమ ఆస్తులను కూడగట్టుకోండి అన్న ధోరణలో, అవినీతి అధికారులకు పదోన్నతులు కల్పిస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఆజాద్ రాష్ట్ర దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ (ఎస్టేట్) గా విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: రిమాండ్‌లో ఉన్న వ్యక్తి కూడా మాకు చెబుతున్నారు.. హవ్వ!

చంద్రశేఖర్ ఆజాద్ కు ఏ మాత్రం తగ్గేదే లేదంటున్నడిప్యూటీ కమిషనర్ విజయ రాజు..
విజయ రాజు అక్రమాస్తుల విలువ అక్షరాల 100 కోట్లు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న యం.విజయ రాజు , 2017 నవంబర్ నెలలో ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు. విజయ రాజు తల్లిదండ్రుల పేర్లతో కోట్లాది రూపాయలు అక్రమ ఆస్తులు.. భారీ బంగారం, వెండి విలువైన ఆస్తులు, భారీగా చీరలు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటి విలువ సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా, అప్పట్లో ఏసీబీ అధికారులు ధృవీకరించారు.

అసిస్టెంట్ కమిషనర్ హోదా నుంచి.. 2020వ సంవత్సరంలోనే విజయరాజుకు అమాంతం డిప్యూటీ కమిషనర్ హోదా కల్పించారు. ఇందులో మతలబు ఏమిటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను అందలం ఎక్కిస్తూ.. పదోన్నతులు కల్పిస్తూ ఉన్నత అధికారులు కూడా అక్రమ సంపాదనలో భాగస్వాములు అవుతున్నారా? అన్నది పలు అనుమానాలకు తావిస్తోంది..

ఏదేమైనా దేవదాయ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారుల పైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని,దేవాదాయ శాఖలో అవినీతి తిమింగలాలను బట్టబయలు చేసి వారికి.. దేవాదాయ శాఖలోనే కాకుండా, ఏ ఇతర ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహించే అర్హత లేకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.

LEAVE A RESPONSE