హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ తనపై నిరాధార వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కేటీఆర్ ఇటీవల పిటిషన్ వేశారు.
తనకు బహిరంగ క్షమాపణతో పాటు రూ. 10 కోట్లు చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సిటీ సివిల్ కోర్టు సోమవారం విచారణ జరిపింది. డిసెంబర్ 15న ఈ కేసు విచారణకు హాజరు కావాలని బండి సంజయ్ కు సమన్లు జారీ చేసింది.