Suryaa.co.in

Entertainment Telangana

నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం

హీరో నాగార్జున వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన సీపీఐ నారాయణ

బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముందు నుంచి కూడా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘హీరో నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం బిగ్ బాస్’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గత శనివారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ… హౌస్ లో ఉన్న భార్యాభర్తలు మరీనా, రోహిత్ లను హగ్ చేసుకోమని అన్నారు. అంతేకాదు… తనను విమర్శించిన నారాయణను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘నారాయణ.. నారాయణ.. వాళ్లు పెళ్లయినవాళ్లు’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ‘నాగన్నా.. నాగన్నా.. బిగ్ బాస్ షోలో పెళ్లయిన వాళ్లకి శోభనం గదిని ఏర్పాటు చేశారన్నా. మిగిలిన వాళ్లు ఏమైనారు అన్నా?’ అని నారాయణ సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

LEAVE A RESPONSE