Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు

అమరావతి : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందించారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నాలుగో బ్లాక్ లో ఉన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు అభినందనలు తెలిపారు. సాహసోపేతమైన నిర్ణయమని, బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని రామకృష్ణ కొనియాడారు.

LEAVE A RESPONSE