(చాకిరేవు)
సైకోలని ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. కానీ మాకు అపోజిషన్ కావాలని అడిగారు. ప్రజలు ఇవ్వని ఆ హోదా దక్కలేదు.
నిస్సిగ్గుగా జగన్.. “గంగమ్మ జాతరలో నరికినట్లు రఫ్ఫా రఫ్ఫా అని నరకతామన్నాడు మన కార్యకర్త, మంచిదే కదా” అని మీడియా సమావేశం పెట్టి మరీ సమర్థించాడు.
సమస్య అని జగన్ బయటకు రావడం, శాంతిభద్రతల విఘాతానికి కారణం అవ్వడం, గూండాలతో కలిసి స్వైరవిహారం చెయ్యడం, ప్రాణాలు పోవడానికి కారణం అవ్వడం, అన్నదాతల పంటలను ధ్వంసం చేసి నష్టపరుస్తూ.. మానసికంగా హింసించడం, మీడియా ప్రతినిధులను కొట్టి గాయపరచడం, క్రిమినల్స్ కు ఓదార్పులు చెయ్యడం, బెట్టింగ్ ఆడే వారికి విగ్రహాలు పెట్టడం లాంటి చర్యలతో ప్రజలకు ఒక వార్మింగ్ ఇస్తున్నట్లున్నారు. మీరు అపోజిషన్ ఇవ్వకపోయినా మేము వస్తాం.. ఊచకోత కోస్తాం అని బరితెగించి మరీ చెబుతూ హెచ్చరిస్తున్నారు.
మొన్నటి వరకు ప్రజాస్వామ్యంలో అధికారం అనుభవిస్తూ ఇలా చేసి మట్టి కరిచారు. ఇప్పుడు పూర్తిగా సైకోలుగా మారిపోయారు. రాజకీయ పార్టీ ముసుగు తీసేశారు. గూండాల గుంపులతో మీటింగులు పెట్టి “రప్పా రప్పా అని నరుకుతామంటూ అరవడం కాదురా.. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి” అని ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఇది అధికారంలో ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితిలో చెప్పిన మాటలు. ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించని, ప్రజల తీర్పును అంగీకరించని ధోరణి.
నేరుగా హింసా పిలుపులు పెరిగిపోతున్నాయి. ఇది ఓటమిని అంగీకరించలేని అహంకారపు అరుపుల పెడబొబ్బలు. ఇది ప్రజలపై తిరిగి దాడి చేయాలన్న సంకేతాలు.
ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్మని నేరస్తుల ముఠాలో ఫ్యాక్షానిష్టు మూలాల వున్న క్రిమినల్ నాయకత్వంలో.. ఇన్నాళ్లూ వైకాపా పార్టీగా.. ముసుగేసుకొన్న వారి నిజ భయంకర రూపం.
ప్రతిపక్షం అనే స్పృహ వారిలో వుంటే ప్రజల తరఫున ప్రశ్నించాలి. కానీ ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటి?
బెదిరింపులు, చీకట్లో పని చేయండి అనే సూచనలు, “నరికెయ్యండి!” అనే ఆదేశాలు. పోలీసుల బట్టలు ఊడదీస్తాం అనే హెచ్చరికలు.
ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
ఇది మన భద్రతకు ప్రమాదం.
ఇది మన పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం.
ప్రజల శక్తి ఓటులో ఉంది.
ఇలాంటి మాటలు చెప్పే క్రిమినల్స్ ను తిరస్కరించండి.
ప్రతిపక్షం అంటే బాధ్యత,
కానీ ఇక్కడ చూస్తున్నది —
బాధ్యతను మరిచి,
బలాన్ని చూపించే ప్రయత్నం.
ఇప్పుడు ప్రశ్న మనదే —
ప్రతిపక్షంలో కూడా లేనప్పుడు
ఇలా మాట్లాడే నాయకులను
మళ్లీ అసెంబ్లీ గేటు తాకనివ్వాలా అని!
ప్రతిపక్షం కోసం సునితంగా చూడండి. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీలు ఉన్నాయి. సమస్యల మీద హుందాగా స్పందిస్తున్నారు.
అసహనంతో ముసుగు తీసిన ఈ క్రిమినల్స్ పట్ల ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ క్రిమినల్స్ తేడా చేస్తే తాటదీసి ఊచలు లెక్కించేలా చెయ్యాలి.
గంగమ్మ జాతరలో నరికినట్లు చీకట్లో గొడ్డలితో నరికి, పొద్దున గుండెపోటు అని మర్డర్ అని తెలిసిపోయాక శత్రువులు చేశారని, హత్యాగావించబడ్డ వారి కుటుంబంతో కలిసిపోయి అంత్యక్రియలు చేశాక, వీరి గురించి బయటపడంగానే, ఆయన కూతురు, అల్లుడే చంపించారు అని కథలు చెప్పిన క్రిమినల్స్.. ప్రజాతీర్పును ఈవీఎం మీద నెట్టేస్తూ.. ఇన్నాళ్లూ తొడుక్కొన్న వీరి ముసుగు తీసేశారు. బహుపరాక్.