Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ – తమిళనాడు సరిహద్దు వైపుగా మాండోస్ తుఫాను

చెన్నై నుంచి నెల్లూరు వరకు హై-అలర్టు

మాండోస్ తుపాన్ విశ్లేషణ తెరకు వచ్చింది. చాలా క్లారిటీతో ఈ తుపాన్ ప్రభావం ఎలా ఉండనుందో చెప్పనున్నాను. బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈ రోజుకి వాయుగుండంగా మారి, రేపటికి మాండోస్ తుపాన్గా మారనుంది. ఇది డిసెంబరు 9కి చెన్నై దగ్గరగా వచ్చి, డిసెంబరు 10న మన ఆంధ్రా – తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని తాకనుంది.

ఇది చెన్నైకి ఉత్తర భాగం అయిన ఆంధ్రా – తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తీరాన్ని తాకనుంది. దీని వలన తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా పూర్తి ప్రభావం పడనుంది. ఈదురుగాలులు తుపాన్ స్ధాయిలో, వర్షాలు భారీ నుంచి అతిభారీగా ఉండనుంది. ఒక నెల్లూరు, తిరుపతి మాత్రమే కాదు. కోస్తాంధ్రలోని అన్ని భాగాల్లో దీని ప్రభావం ఉండనుంది. విశాఖలో కూడ దీని ప్రభావాన్ని చూడగలము. అసలు తక్కువ అంచనా వేయకండి. ఎక్కడో ఆంధ్రా – తమిళనాడు సరిహద్దే కదా అని చూడకండీ. గత 14 సంవత్సరాల్లో ఈ సీజన్ లో మనకు దగ్గరగా వస్తున్న బలమైన తుపాన్. దయజేసి జాగ్రత్తలు తీసుకోండి.

LEAVE A RESPONSE