– కవిత
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హరీశ్ రావు తో ముప్పు పొంచి ఉందని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు బీఆర్ఎస్ మంచి కోరుకునే వారు కాదని అన్నారు. ఇప్పుడు నన్ను పార్టీ నుంచి బయటకు పంపారని, రేపు కేటీఆర్కు కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చని అన్నారు. నాన్న అన్నను కాపాడు అంటూ కవిత కేసీఆర్ కు సూచించారు.