Suryaa.co.in

Andhra Pradesh

దళిత, బీసీ వర్గాల ద్రోహి.. వీసీ రాజశేఖర్

– నలుగురు గెస్ట్ ఫ్యాకల్టీ ల పొట్ట కొట్టిన వీసి రాజశేఖర్
– వ్యక్తిగత కక్షకు వర్సిటీ నిధులు దుబారా చేసిన వీసి
-కుల రాజకీయాలతో వర్సిటీ వాతావరణాన్ని నాశనం చేసిన వీసి
– వీసి రాజశేఖర్ కబంధహస్తాల నుంచి నాగార్జున వర్సిటీని కాపాడాలి

ప్రపంచ మేధావి, దళితుల ఆశాజీవి, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కు వారసుడునని చెప్పుకుంటున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసి ఆచార్య రాజశేఖర్ ముగ్గురు దళితులు, ఒక బీసీ వర్గానికి చెందిన అధ్యాపకుల పొట్ట కొట్టారు.విసి రాజశేఖర్ తన వ్యక్తిగత కక్షను నలుగురు అతిధి అధ్యాపకులపై తీర్చుకోవడానికి విశ్వవిద్యాలయం నిధులను దుబారా చేశారు.
విశ్వవిద్యాలయానికి శాశ్వత వీసీ కాగానే రాజశేఖర్ అతిధి అధ్యాపకుల రెన్యువల్ కు ఇంటర్వ్యూ లంటూ బూటకపు ఇంటర్వ్యూలు నిర్వహించి నలుగురు దళిత,బిసి వర్గాలకు చెందిన అతిధి అధ్యాపకులను ఉద్యోగాల నుంచి తొలగించి వారి పొట్ట కొట్టారు.

తొలగింపుపై నలుగురు అతిధి అధ్యాపకులు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇంటర్వ్యూల సెలక్షన్ కమిటీ మినిట్సును పరిశీలించి ఇంటర్వ్యూలు బూటకమని, ఏకపక్షంగా, కక్షపూరితంగా నిర్వహించారంటూ ఆ ఇంటర్వ్యూలను రద్దు చేయటంతో పాటు ఉద్యోగాల నుంచి తొలగించిన నలుగురు అతిధి ఆధ్యాపగలను రెండు వారాల్లోపు ఉద్యోగంలోకి తీసుకోవాలని తీర్పునిచ్చారు.

ప్రపంచ మేధావిని, దళితుల ఆశా బంధునని,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసుడునని చెప్పుకుంటున్న ఆచార్య రాజశేఖర్ హైకోర్టు తీర్పును గౌరవించకుండా, ఆ నలుగురుపై తన వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికి న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డికి ఆరు లక్షల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించి హైకోర్టులో సవాల్ చేసి దళిత,బిసి వర్గాల ద్రోహిగా రాజశేఖర్ నిలిచారు.

తన బౌన్సర్లకు రెన్యువల్ తో పాటు ఉద్యోగాలు
ఏఎన్యూ తాత్కాలిక విసిగా రాజశేఖర్ నియమితులైనప్పటినుంచి తనకు బౌన్సర్లుగా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు మద్దతుగా నిలిచిన వారితోపాటు వైసీపీ నాయకుల చేత సిఫార్సులు చేయించిన వారికి సోషియాలజి ,కామర్స్ అండ్ మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ ఆర్ ఎం విభాగంలో, ఇంజనీరింగ్ కాలేజీలోని మెకానికల్ విభాగంతో పాటు ఆర్కిటెక్చర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఇచ్చారు.
అలాగే పిసి రాజశేఖర్ తన ఇద్దరు స్కాలర్లకు ఇంగ్లీషు విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ఇచ్చారు.

వర్సిటీ గ్రంథాలయంలో రోజువారి వేతన ఉద్యో గీగా పనిచేస్తున్న కొండలరావును ఎంఎల్ ఐసి విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగం ఇచ్చి నెలకు 30000 వేతనంగా చెల్లిస్తున్నారు. వాస్తవంగా ఇతను ఎకనామిక్స్ లో పిహెచ్.డి చేశారు.ఎల్. ఐ.సి కోర్సులో ఇతనికి పీహెచ్.డి లేకపోయినాను నిబంధనలకు విరుద్ధంగా నెలకు 30000 వేతనం చెల్లిస్తున్నారు.

తన అనుచరులుగా ఉన్న ఒక గెస్ట్ ఫ్యాకల్టీకి నెలకు 40000 వేతనంగా చెల్లించడంతో పాటు హాస్టల్ అడిషనల్ వార్డెన్ గానియమించడం జరిగింది. ఇదే పదవి తన ప్రముఖ అనుచరుడు కి కూడా ఇచ్చారు.

విసి రాజశేఖర్ నిబంధనలకు విరుద్ధంగా తనకు బౌన్సులర్లుగా వ్యవహరించిన గెస్ట్ ఫ్యాకల్టీలను పీజీ, బీఈడీ, ఇంజనీరింగ్ జవాబు పత్రాలు మూల్యాంకనం కేంద్రాలలో ఏసిటిఏ లుగా నియమించి అదనపు ఆదాయం సమకూర్చారు.

తనకు మద్దతుగా నిలిచిన కోటేశ్వరరావు అనే అతనిని వర్సిటీ ఫూలే అధ్యయనం కేంద్రంలో ప్రోగ్రామర్ గా నియమించారు.
వైసీపీ నాయకుల సిఫార్సులతో పాటు లక్షలు వసూలు చేసి చాలామందిని కాజువల్ లేబర్ ఉద్యోగులుగా నియమించి పని లేకుండా వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రంధాలయంలో ఉంచడం జరిగింది..ఆ తర్వాత వారిని వేరు వేరు విభాగాలకు నియమిస్తూ రాజశేఖర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు.

పాలకమండలి ఆమోదం లేకుండానే నిధులు వినియోగం
వీసి రాజశేఖర్ నాక్ సందర్శన పేరుతో పాలకమండలి ఆమోదం లేకుండానే వర్సిటీ డిపాజిట్లను నుంచి రోడ్లకు కోట్లాది రూపాలను దుర్వినియోగం చేశారు. విసి వర్సిటీ గ్రంధాలయం వద్ద సైంటిస్టుల విగ్రహాలను పెద్ద మొత్తంలో పెట్టి గ్రంథాలయం వాతావరణాన్ని నాశనం చేశారు.

వీసి రాజశేఖర్ వర్సిటీలో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ తన కులం వారిని అందలం ఎక్కించి మిగతా కులాల వారిని పలు రకాలుగా వేధించి వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేశారు.

– ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిరక్షణ సమితి

LEAVE A RESPONSE