– సర్కులర్ 172 తీసుకొచ్చి దళిత వాడల్లో ప్రాధమిక పాఠశాలలను మూసివేశాడు
– బెస్ట్ అలైలబుల్ స్కూల్స్, బుక్ బ్యాంక్ స్కీంలు రద్దు చేశాడు
– అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని నీరుగార్చాడు
– పీజీ విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేశాడు
-ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపా ధ్యాక్షులు తెలుగుదేశం పార్టీ కోడూరి అఖిల్
దళిత విద్యార్ధులకు ప్రాధమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు అన్నింటిని ధ్వసం చేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కోడూరి అఖిల్ ధ్వజమెత్తారు. జగనన్న విద్యాదీవెన పేరుతో శుక్రవారం విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ‘జగనన్న దగా-దోపిడీ’ గా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
‘జగన్ రెడ్డి దళిత విద్యా విద్రోహి’ పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ జగన్ రెడ్డి సర్కులర్ 172 జారీ చేసి దళిత వాడల్లోని 1,2 తరగతులను అంగన్‌వాడీలలో విలీనం చేసి చేసి ప్రాధమిక పాఠశాలలు రద్దు చేశాడు. జగన్ రెడ్డి అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని మూడున్నరేళ్లు అమలు చేయలేదు. అంతేకాకుండా దళితుల ఆరాధ్య దైవమైన డా.అంబేడ్కర్ పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యగా మార్చుకున్నాడు. ఈ పథకం ద్వారా చంద్రబాబు నాయుడు 2014-19 ఐదేళ్ల కాలంలో మొత్తం 4,923 మంది విద్యార్ధులు లబ్ది పొందితే..జగన్ రెడ్డి హయాంలో కేవలం 116 మంది విద్యార్ధులకు మాత్రమే లబ్ది చేకూరింది.
జీవో నెం.107 విడుదల చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కన్వినర్ కోటా తీసుకొచ్చి రిజర్వేషన్లు రద్దు చేశాడు. దీంతో 1088 మెడికల్ సీట్లు దళిత విద్యార్ధులు కోల్పోయారు. 17 సంవత్సరాలుగా అమలవుతూ..దళిత విద్యార్ధుల పోటీపరీక్షల శిక్షణకు ఎంతోగానో ఉపయోగపడిన ఏపీ స్టడీ సర్కిళ్లు, అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లను మూసివేయించిన దళిత విద్యా విద్రోహి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు.
2003లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా 5 వ తరగతి మొదలుకొని పీజీ చదివే దళిత విద్యార్ధులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తించేది. జగన్ రెడ్డి అమ్మఒడి తీసుకొచ్చి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ఇంట్లో ఒక్కరికే పరిమితం చేశారు. జీ.వో నెం. 77 తీసుకొచ్చి ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో చదివే ఎం.ఎస్సీ, ఎం.కాం, ఎం.సీ.ఏ, ఎం.బీ.ఏ కోర్సులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేశాడు. బుక్ బ్యాంక్ స్కీం ద్వారా అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో, యూనివర్శిటీల్లో చదివే దళిత విద్యార్ధులకు లైబ్రరీల్లో ప్రత్యేక రీడింగ్ సెల్స్ ఏర్పాటు చేసి అందులో స్టడీ మెటీరియల్స్ ఉంచాలి.
కేంద్ర ప్రభుత్వం సాయం చేసే ఈ పథకాన్ని కూడా రద్దు చేసిన ఘనుడు జగన్ రెడ్డి. ఇలా ప్రాధమిక విద్య మొదలు కొని ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో దళిత విద్యార్ధుల భవిష్యత్తును నాశనం చేసిన దళిత ‘విద్యా విద్రోహి జగన్ రెడ్డి’ అని అఖిల్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి లాంటి దళిత విద్యా విద్రోహిని రాబోయే ఎన్నికల్లో దళితులంతా ఏకమై అధికార పీఠం నుంచి దించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.