– మాజీ ఎంపీ హర్షకుమార్
అమలాపురం : రాష్ట్రపతి ఎన్నికను పావుగా వాడుకొని రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుకు వైకాపా పట్టుబట్టాలని మాజీ ఎంపీ హర్షకుమార్ సూచించారు. సీఎం జగన్ కేసులకు భయపడితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయమే జరగుతుందన్నారు.
ప్రత్యేక హోదా సాధించాలంటే రాష్ట్రపతి ఎన్నికలను వైకాపా బహిష్కరించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపాది కీలకపాత్ర కాబట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేస్తే రాష్ట్రానికి రావాల్సినవన్నీ వస్తాయన్నారు. కేంద్రం మెడలు వంచేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదన్నారు. సెప్టెంబర్ 25న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సింహగర్జనకు మైనార్టీలను కలుపుకొని వెళతామని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఉహాగానాలపైనా హర్ష కుమార్ తనదైన శైలిలో స్పందించారు. జాతీయ పార్టీ కంటే ముందు రేవంత్ రెడ్డిని ఢీకొనాలని సూచించారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు.