– మనుషుల ప్రాణాలు తీసే రాక్షసులంతా వైసీపీలోనే ఉన్నారు
– ముందస్తు ఎన్నికలకు వెళ్తే వైసీపీ మాడు పగులకొడారన్న భయంతోనే జగన్ ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నారు
– ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు దళితులు సిద్దంగా ఉన్నారు
– మాజీ మంత్రి కె. ఎస్ జవహర్
వైసీపీ పాలనలో రాష్ట్ర్రంలో దళితులు రెండవ తరగతి పౌరుల్లా బ్రతుకుతున్నారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో మూలన దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు నిత్యకృతమయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో అంగన్వాడీ టీచర్ హనుమాయమ్మను వైసీపీ నేత పట్టపగలే ట్రాక్టర్ తొక్కి చంపటం రాష్ట్రంలోని దళితుల పరిస్థితికి అద్దం పడుతోంది.
మనుషుల ప్రాణాలు తీసే రాక్షసులంతా వైసీపీలోనే ఉన్నారు. రాక్షస జాతికి తండ్రిలా జగన్ వ్యవహరిస్తూ.. నిందితుల్ని కాపాడుతున్నారు. జగన్ రెడ్డి అండ చూసుకునే వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిరసనల పేరుతో ప్రతిపక్ష నేతల్ని హౌస్ అరెస్టు చేసే పోలీసులు మనుషుల ప్రాణాలు తీస్తున్న మృగాల్ని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారు? హనుమాయమ్మను చంపిని నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.
దళిత ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్రెడ్డి దళితులకు అన్ని రంగాల్లోనూ అన్యాయం చేశారు. వైసీపీ నాలుగేళ్ల జగన్ పాలనలో ఎస్సీలను ఆర్థికంగా, సామాజికంగా40ఏళ్లు వెనక్కి నెట్టారు. ఎస్సీల కోసం ప్రత్యేకంగా జగన్ ఒక్క బటన్ అయినా నొక్కారా..?. నాలుగు ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిలో రాజధానిని నీరుగార్చిన దళిత ద్రోహి జగన్‌రెడ్డి .దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులను పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు.
టీడీపీ ప్రవేశపెట్టిన 27 దళిత పథకాలను రద్దు చేశా రు. రూ.33 వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారు, 12 వేల ఎకరాల దళితులకు ఇచ్చిన అసైన్డ్భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే వైసీపీ మాడు పగులకొడారన్న భయంతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెనకడుగు వేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు దళితులు సిద్దంగా ఉన్నారు.