– జనసేన ఇన్చార్జి గరికపాటి వెంకట్
దర్శి : పట్టణ గడియార స్తంభం కూడలి నందు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గరికపాటి వెంకట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. .
ఇందులో భాగంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పూర్తి స్థాయిలో నాయకులకు మరియు కార్యకర్తలకు తెలియజేసిన వెంకట్.. దర్శి నియోజకవవర్గం రాష్ట్ర స్థాయి లో మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా సభ్యత్వాల భారీ సంఖ్యలో జరగాలని పార్టీ శ్రేణులను కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జోరు పెంచిన గరికపాటి
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జానసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గరికపాటి వెంకట్ ఆద్వర్యం లో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు చురుకుగా పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో కన్న దర్శి నియోజకవర్గం లో సేన కార్యకర్తలు- వీర మహిళలు రెట్టించిన ఉత్సాహంతో గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో పెద్ద యెత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామాలలో క్రియాశీల కార్యకర్తలు ,ప్రజలు స్వచ్ఛందంగా నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ముందు వరసలో వుండడం విశేషం.ఈ కార్యక్రమంలో గరికపాటి వెంకట్ నాయకత్వానికి విశేష మద్దతు లభిస్తోంది.