– సీఎంకు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ లేఖ
తెలంగాణలో పేరుకుపోయిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. దాసోజు లేఖ సారాంశం ఇదీ..
17th March, 2022
గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు,
శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి నమస్కరించి దాసోజు శ్రవణ్ వ్రాయునది..
విషయం: 40లక్షల మందిని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ మహమ్మారి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే “నిరుద్యోగ ఎమర్జెన్సీ” ప్రకటించండి.
అయ్యా..
.ఎనిమిదేళ్ళ సుధీర్గ నిరీక్షణ తర్వాత 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తమరు అసెంబ్లీలో చేసిన ప్రకటన సంతోషాన్ని కలిగించింది. అయితే బిశ్వాల్ కమిటీ 1లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు వున్నాయని చెప్పింది. కానీ తమరు మాత్రం 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. 40 లక్షల మంది నిరుద్యొగులను, వారి కుటుంబాలను పట్టి పీడిస్తున్న నిరుద్యోగ మహమ్మారి సమస్యను పరిష్కరించే బాధ్యత మనందరిపై ఉంది. అందుచేత, మేము ఈ క్రింద పొందుపర్చిన నిర్దిష్టమైన సలహాలు సానుకూల దృక్కోణంతో అమలు చేయాలనీ విజ్ఞప్తి.
1. 40 లక్షల మంది జీవితాలను ఛిద్రం చేస్తున్న నిరుద్యొగ సమస్యను సామాజిక, ఆర్ధిక సమస్యగా గుర్తించి, వెంటెన్ నిరుద్యోగ ఎమర్జెన్సీ” ప్రకటించండి.
2. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధంగా, వివిధ జాతీయ స్థాయీ పారిశ్రామిక వేత్తలతో, అకాడమీషియన్స్ తో, మేధావులు, వ్యూహకర్తలు, విద్యావంతులు, పాలసీ మేకర్స్ తో, “ఉన్నతస్థాయి స్పెషల్ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేసి, తెలంగాణ స్థితిగతులకు అనుగుణమైన నిర్దిష్టమైన విధి విధానాలతో కూడుకున్న వ్యూహాన్ని తయారు చేయాలి.
3. ఇది సామజిక సమస్య, అంచేత అన్ని రాజకీయ పార్టీలతో “అత్యవసర అఖిల పక్ష సమావేశాన్ని” నిర్వహించాలి.
4. 2018 ఎన్నికల సందర్బంగా మీరు వాగ్దానం చేసినట్లుగా, 2019 వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేటాయించిన 1800 కోట్ల రూపాయల నిధులను కోన సాగిస్తూ, వెంటనే, Rs 3001/- ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగభృతి అందచేయాలి.
5. ప్రతి మండల కేంద్రాల్లో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు, ఉపాధి లభించే విధంగా శిక్షణ, మరియు ప్రైవేట్ సెక్టార్ కంపెనీల సహకారంతో, ఉద్యోగ మేళాలు నిర్వహించాలి.
6. ప్రభుత్వ ఉద్యోగాలలో, 95% స్థానికులకు రిజర్వేషన్స్ ఇచ్చినట్లుగా, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలలో కూడా 95% తెలంగాణ స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా చట్టం చేయాలి, అమలు చేయని కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలి.
7. ఎస్సి, ఎస్టీ, బీసి, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్స్ లో లక్షల కొద్ది లోన్ అప్లికేషన్స్ పెండింగ్ లో వున్నాయి. వెంటనే వారికి ఈ లోన్స్ ని అండ చేసి, వారికి సెల్ఫ్ ఎంప్లామెంట్ కలిగించి వారికాళ్ళపై వారు నిలబడే విధంగా చర్యలు తీసుకోవాలి.
8. 7651 ఫీల్డ్ అసిస్టెంట్లు తమ హక్కులని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిరసన తెలిపారనే కోపంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ దుశ్చర్య వలన దాదాపు 70 మంది చనిపోయారు. కొందరు భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు వుద్యోగం లేదనే ఆత్మనూన్యతో, జీతంలేక, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక, భవిష్యత్ పై అందోళనతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మెజారిటీ బిసి , ఎస్సి, ఎస్టీ బిడ్డలే వున్నారు. ఇలాంటి వారిపట్ల తెలంగాణాలో స్ట్రైక్ చేయడం, చట్ట వ్యతిరేకం అన్నట్లు, రెండేళ్ళు ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరించింది. ఏదేమైనా రెండేళ్ళు తర్వాత మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మీ నిర్ణయానికి సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఈ రెండేళ్ళ జీతాన్ని 7651 ఫీల్డ్ అసిస్టెంట్లు చెల్లించాలి. అలాగే చనిపోయిన 70మందికి కోటి రూపాయిలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.
9. ఈ మధ్యకాలంలోప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపొగా, ఉన్న ఉద్యోగాలు ఊడపీకిన్రు. 7651 ఫీల్డ్ అసిస్టెంట్లతో కలుపుకుని, మొత్తం 52,515 మంది ఉద్యోగులని ప్రభుత్వం తొలగించింది. స్వర్వ శిక్ష అభియాన్ లో 21200 మంది, కోవిడ్ కాలంలో పని చేసిన నర్సులు1640, మిషన్ భగీరదలో 709, హార్టికల్చర్ 315, ఉద్యావలీంటీర్లు 16, 400మంది, జూనియర్ పంచాయితీ కార్యదర్శకులు 2000మంది, సోషల్ వెల్ఫేర్, విధ్యాశాఖ. ఆర్టీసి చెందిన 2640మంది ఉద్యోగులని తొలగించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పునర్నియామకం చేయిసిండ్రు కాబట్టి, ఇంకా 44,884 మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. వీరిందరిని మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి.
10. ఈ రాష్ట్రంలో దాదాపు 40లక్ష మంది నిరుద్యోగులు వున్నారు. తమరు ప్రకటించిన 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో ఈ సమస్య పరిష్కారం కాదు. 10 జిల్లాలు ఉన్నప్పుడు 4.91 లక్షలు సాంక్షన్డ్ పోస్టులున్నప్పుడు, 33 జిల్లాలకు ఇంకా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి. .
నిరుద్యోగం అనేది ఒక మహమ్మారి. నిరుద్యోగ సమస్య వల్ల, లక్షలమంది నిరుద్యోగులు, వారి కుటుంబాలు ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతూ, అనేక మంది, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంచేత వెంటనే “నిరుద్యోగ ఎమర్జెన్సీ” ని ప్రకటించి, యుద్ద ప్రాతిపదికన నిర్దిష్టమైన పరిష్కార మార్గం కనుక్కోవాలని మనవి చేస్తున్నాను.
ఈ సమస్య పరిష్కారం కోసం, గతంలో ప్రాసెసర్ గానే కాదు, పెద్ద పెద్ద కంపెనీలలో, మానవనరుల అభివృద్ధి డిపార్ట్మెంట్లలో వివిధ హోదాలలో పని చేసిన నేను, ఈ సమస్య పరిష్కారినికి తోడ్పడేందుకు ఎల్లపుడు సిద్ధం. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా గతంలో మంత్రులుగా పనిచేసి, సామజిక బాధ్యత ఉన్న అనేక మంది మేధావులు ఉన్నారు. మేము, మీరు అంత కలిసి 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి కల్పించి వారిని, వారి కుటుంబాలను మానవత దృక్పథంతో ఆదుకుందాం.
Thanking you,
Yours truly,
Dr. Sravan Kumar Dasoju