Suryaa.co.in

Andhra Pradesh National Telangana

తెలుగు కేంద్రమంత్రులకు దత్తాత్రేయ విందు

-తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయండి
-కేంద్రమంత్రులకు బండారు పిలుపు

డిల్లీ: ఎంపీలుగా ఎన్నికయి, కేంద్రమంత్రులుగా పదవీబాధ్యతలు స్వీకరించిన తెలుగు ఎంపీలను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. తన ఆహ్వానం మేరకు ఢిల్లీలోని హరియాణా భవన్‌కు విందుకు హాజరైన కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్, శ్రీనివాసవర్మను దత్తాత్రేయ సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇతోధికంగా పనిచేసి, రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారికి సూచించారు.

LEAVE A RESPONSE