Home » మోదీతో దత్తాత్రేయ భేటీ

మోదీతో దత్తాత్రేయ భేటీ

-కుటుంబసభ్యులతో ప్రధానిని కలిసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ
-మోదీని అభినందించిన గవర్నర్ దత్తాత్రేయ
-‘విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని ప్రధానికి బహుకరించిన బండారు

న్యూఢిల్లీ: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గవర్నర్ కృష్ణ భగవానుని ‘విరాట్ స్వరూప్’ విగ్రహాన్ని ప్రధానికి బహూకరించారు.

వరుసగా మూడోసారి ప్రధానమంత్రి గా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక అభినందనలు , శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా చరిత్ర, సామాజిక-సాంస్కృతిక వారసత్వం , రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ ప్రధాని మోదీతో చర్చించారు.

గవర్నర్ సతీమణి బండారు వసంత, ఆమె కుమార్తె బండారు విజయలక్ష్మి, అల్లుడు డాక్టర్ బి జిగ్నేష్ రెడ్డి, బండారు శివ శంకర్ , గవర్నర్ మనవరాళ్లు యశోధర రెడ్డి, వేదాంషి రెడ్డి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మిస్ యశోధర మిస్ వేదాన్షి కూడా ప్రధాని కోసం హిందీలో రెండు పాటలు పాడారు. ఈ పాటలు – “మాం సే జ్యాదా మాత్రభూమి కో జిసనే మాన్ దియా, ఖుద్ కా జీవన్ భీ జైసనే’’ దిల్ పే హాథ రఖ్ కే యే కసమ్ లే హమ్ సభీ, న జుకేగా దేశ్ అపనా న జుకేంగే హమ్ కభీ!” వారి పాటలకు ముగ్ధులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారిని అభినందించి ఆశీర్వదించారు.

Leave a Reply