Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి జమానాలో అప్పులు ఫుల్ – అభివృద్ధి, సంక్షేమం నిల్

• 1956 నుంచి 2019వరకు రాష్ట్రప్రభుత్వం తరుపున చేసిన మొత్తం అప్పు రూ. రూ.3లక్షల14వేల495కోట్లు
• 63 సంవత్సరాల్లో అయిన అప్పుకంటే ఎక్కువ గా జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ రెండున్నరేళ్లలోనే రూ.3లక్షల64వేల104కోట్ల అప్పుచేశాడు
• అప్పులు తెచ్చిన సొమ్మంతా ఏమవుతుందంటే సంక్షేమానికి ఖర్చుపెడుతున్నామని బుకాయిస్తన్నారు
• టీడీపీప్రభుత్వంలో ఏటా సరాసరిన చంద్రబాబునాయుడుగారు సంక్షేమానికి రూ.60వేలకోట్లు ఖర్చుపెట్టారు
• సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, ప్రజాసంక్షేమానికి ఏటాపెడుతున్న ఖర్చు రూ.42వేలకోట్లకుమించలేదు
• సంక్షేమం, అభివృద్ధిలో చంద్రబాబునాయుడి కంటే తక్కువఖర్చుపెట్టిన జగన్మోహన్ రెడ్డి, అప్పుల్లో మాత్రం ముందున్నాడు
• కేవలం తనలూఠీ, దుబారాకోసమే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి, ప్రజలను పన్నులరొంపిలోకి దించి బాధిస్తున్నాడు
• కరోనాతో ఆదాయం తగ్గిందంటూ కలరింగ్ ఇస్తున్న వైసీపీప్రభుత్వం, కరోనాతో పేదలకు తిండేలేకుండా పోయిందనే వాస్తవాన్ని ఎందుకు గ్రహించదు
• జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతల మాటలు, సాక్షిమీడియా దుష్ప్రచారం నమ్మితే ప్రజలు దారుణంగా మోసపోతారు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ.రెడ్డి

అదుపులోనే అప్పులంటూ సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలు రాశారని, దేశమంతా ఏపీ అప్పులపై చర్చించుకుంటున్న తరుణంలో, ఆచర్చను ప్రజలఆలోచనలను పక్కదారి పట్టిం చే ప్రయత్నాలను పాలకులు, వారి అనుకూలమీడియాతోచేయిస్తున్నారని, అధికారపార్టీ అ భిమానులను మభ్యపెట్టి, వారిద్వారా ప్రజలను ఏమార్చాలన్నదే పాలకుల దురుద్దేశమని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి స్పష్టంచేశారు.

సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే … 2020-21కి గాను బడ్జెట్ అంచనాలకు మించి 14.2శాతమే తాము అప్పులు చేశామని ఏపీ ప్రభుత్వం చెప్పడం, ఇతరరాష్ట్రాలతో పోల్చిమరీ సాక్షిలో తప్పుడురాతలు రాయించడం జరిగింది. ఈ ప్రభుత్వం బడ్జెట్ లో అంచనాలనే పెట్టాల్సిన దానికంటే అధికంగా 2020-21 కి సంబంధించి రూ.20వేలకోట్లు పెంచి చూపింది. ఏ రాష్ట్రం చేయని పథకాలను తమప్రభుత్వం లో అమలుచేస్తున్నామని చెప్పి, రూ.20వేలకోట్లను పెంచి చూపించింది. అలాచెప్పినప్పుడు ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు రూ.20వేలకోట్లను తగ్గించి చూపాలి.. కానీ ఆపని చేయలేదు. అలానే ఎఫ్ఆర్ బీఎం (ప్రభుత్వఅప్పులు) మాత్రమే చూపించారు.

మరి ఇదే ప్రభుత్వం కార్పొరేషన్లు, వివిధవిభాగాలద్వారా తీసుకొచ్చిన అప్పులను ఎందుకు లెక్కల్లో చూపడంలేదు? రూ.48,200కోట్లు బడ్జెట్లో పెట్టిన ప్రభుత్వం, రూ.55,167కోట్లు మాత్రమే అప్పుతెచ్చామని, కేవలం 14.2శాతంమాత్రమే అప్పులపరిధిని దాటామని చెప్పుకొచ్చారు. 2020-21 కి సంబంధించి

ప్రభుత్వం తీసుకొచ్చుకోవాల్సిన అప్పే రూ.28వేలకోట్లు అయితే, రూ.20వేలకోట్లు అదనంగా చేసి, రూ.55వేలకోట్ల అప్పులుచేసి, ఇంకా తక్కువే చేశామని ,, అదుపులోనే అప్పులని ఎలా చెప్పుకుంటారు?

రూ.55వేలకోట్లకు తోడు కార్పొరేషన్లద్వారా రూ.75వేలకోట్లసొమ్ముని అదనంగా అప్పులరూపంలో పోగేశారు. ఆ సొమ్మంతా అప్పు కాదా.. దానికి ఈ ప్రభుత్వమే కదా గ్యారంటీగా ఉంది. దాన్ని లెక్కలోకి తీసుకోకపోతే ఎలా? 209 నుంచి 2021నవంబర్ 30వరకు ఈప్రభుత్వం చేసిన అప్పులను ఒక్కసారి పరిశీలిస్తే, ప్రభుత్వఅప్పు రూ.లక్షా51వేల343కోట్లు అయితే, కార్పొరేషన్లద్వారా తెచ్చి అప్పు రూ.లక్షా 21వేల761కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తెచ్చింది రూ.79వేలకోట్లు వడ్డీలకింద చెల్లిస్తున్నది రూ.12వేలకోట్లు కలిపి మొత్తం రూ.3లక్షల64వేల104కోట్లు. ఈరెండున్నరేళ్లలో జగన్మోహ న్ రెడ్డి ప్రభుత్వం చేసినఅప్పు రూ.3లక్షల64వేల104కోట్లు.

రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి అంటే 1956నుంచి2019వరకు మొత్తం ఏపీప్రభుత్వం చేసిన అప్పు రూ.3లక్షల14వేల495కోట్లు. 63 సంవత్సరాల్లో అయిన అప్పుకంటే ఎక్కువ గా జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ రెండున్నరేళ్లలోనే రూ.3లక్షల64వేల104కోట్లఅప్పుచేసింది కాక, అప్పులు అదుపులో, ప్రజలు సంతోషంలో ఉన్నారని ఎలా చెబుతాడు?దారుణంగా దేశంలో ఏ ప్రభుత్వంచేయనంత అప్పుచేసిందిచాలక ఇంకా సిగ్గులేకుండా అదుపులోనే అప్పులంటూ సాక్షిలో తప్పుడురాతలు రాయించుకుంటారా?

అప్పులకు సంబంధించి ఆర్థిక మంత్రి బుగ్గన గతంలో మాట్లాడుతూ, తమప్రభుత్వం బడ్జెట్ అంచనాలకు మించి అధికంగా అప్పులుచేసిందని, దానిలో తప్పేముందంటూ సమర్థించుకున్నారు. సజ్జల మాట్లాడుతూ అప్పులుచేయడం తప్పెలా అవుతుందనిమాట్లాడారు. (బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డిల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఈసందర్భంగా జీ.వీ.రెడ్డి విలేకరులకు ప్రదర్శించారు)
రాష్ట్రవిభజన జరిగే నాటికి ఏపీకిరూ.16వేలకోట్ల రెవెన్యూ లోటుఉంటే, దాన్ని చంద్రబాబునాయుడు తానుదిగిపోయేనాటికి రూ.4వేలకోట్లకుతగ్గించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తన చేతగానితనంతో కేవలం రెండేళ్లలోనే దాన్ని రూ.38వేలకోట్లకు పెంచేశాడు.

అదేమంటే సంక్షేమానికి ఖర్చుపెడుతున్నామంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. టీడీపీప్రభుత్వంలో ఏటా సరాసరిన సంక్షేమానికి రూ.60వేలకోట్లు ఖర్చుచేస్తే, జగన్మోహన్ రెడ్డి ఏటా రూ.42వేలకోట్లు ఖర్చుపెట్టడానికే కిందమీదా పడుతున్నాడు. చంద్రబాబునాయుడి హయాంలో కేవలం 4ఏళ్లలోనే వేలకోట్ల ఆస్తులను రాష్ట్రంలో సృష్టించారని గతంలో సాక్షిపత్రికలోనే రాశారు. 2016-17లో రూ.21,300కోట్లు, 2017-18లో రూ.25,722కోట్లు, 2018-19లో రూ.35,364కోట్లను చంద్రబాబుప్రభుత్వం సంపదసృష్టికి (క్యాపిటల్ ఎక్స్ పెండేచర్) ఖర్చుపెట్టింది.

జగన్మోహన్ రెడ్డి 2019-20లో రూ.37,230కోట్లు కేపిటల్ ఎక్స్ పెండేచర్ కింద ఖర్చుపెట్టినట్లు చెప్పుకుంటే, కాగ్ నివేదికలో మాత్రం రూ.12,244కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని ఉంది. కేపిటల్ ఎక్స్ పెండేచర్ వినియోగాన్నికూడా రెండున్నర, మూడురెట్లు పెంచి తప్పురాతలురాస్తున్నారు. కేపిటల్ ఎక్స్ పెండేచర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబునాయుడికంటే అథమంగానే ఉన్నాడు.

టీడీపీప్రభుత్వంలో ఏటా సరాసరిన కేపిటల్ ఎక్స్ పెండేచర్ కి రూ25వేలకోట్లుఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం ఏటా రూ.14వేలకోట్ల కంటే ఎక్కువపెట్టలేదు. సంక్షేమం విషయంలోకూడా ఏపీప్రభుత్వం పచ్చి అబద్ధాలేచెబుతోంది. 2014-19మధ్యన ఏటా సంక్షేమానికి టీడీపీప్రభుత్వం రూ. 60వేలకోట్లు ఖర్చుపెడితే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏటాపెట్టేఖర్చు రూ.42వేలకోట్లకుమించలేదు. సంక్షేమం, అభివృద్ధిలో చంద్రబాబునాయుడి కంటే తక్కువఖర్చుపెట్టిన జగన్మోహన్ రెడ్డి, అప్పుల్లో మాత్రం ముందున్నాడు. కేవలం తనలూఠీ, దుబారాకోసమే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి, ప్రజలను పన్నులరొంపిలోకి దించాడు.

కరోనా వల్ల ఆదాయంలేదని, 2019లో రూ.8వేలకోట్ల ఆదాయం తగ్గిందని ప్రజలపై పన్నులు వేస్తున్నామంటున్నారు… కరోనా ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, ప్రభుత్వపెద్దలకేనా.. ప్రజలకు లేదా? 2019 ఏప్రియల్ నుంచి 2020 మార్చి ఆర్థికసంవత్సరంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గే ఛాన్సే లేదు. ఎందుకంటే కేంద్రప్రభుత్వం కరోనా లాక్ డౌన్ విధించింది మార్చిఆఖరులో. ఆర్థికసంవత్సరంలో కేవలం ఒకవారం ముందు లాక్ డౌన్ విధిస్తే, ఆవారానికే జగన్మోహన్ రెడ్డిప్రభుత్వానికి రూ.8వేలకోట్ల నష్టంవచ్చిందా?

2020-21లో మూడునెలలు లాక్ డౌన్ పెడితే, రూ.14వేలకోట్ల ఆదాయం తగ్గిందని సాక్షిపత్రికలో రాయించారు. 2020-21లో ఈప్రభుత్వం మద్యంపై విపరీతంగా పన్నులుపెంచడంతోపాటు, ఆస్తిపన్నుపెంచింది. వాటివల్ల ఆదాయం రెండు, మూడురెట్లుపెరిగింది. 2020—21లో ఒక్కమద్యంపైనే జగన్ ప్రభుత్వానికి రూ.30వేలకోట్ల ఆదాయం వచ్చింది. చంద్రబాబునాయుడి గారిహాయాంలో మద్యం పై సంవత్సరానికి రూ.12వేలకోట్లు వచ్చేది. ఐదేళ్లలో మొత్తంకలిపినా రూ.60వేలకోట్లకు మించలేదు.
దశలవారీ మద్యపాననిషేధమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదే మద్యాన్ని అమ్ముకుంటూ ఏటా రూ.30వేలకోట్లు పోగేస్తున్నాడు. మద్యంపై రూ.12వేలకోట్ల ఆదాయం పొందినవ్యక్తికి బుద్ధిఉండాలా.. లేక రూ.30వేలకోట్లు ముక్కుపిండి మరీ వసూలుచేస్తున్న ఈ ముఖ్యమంత్రికి బుద్ధిఉండాలా అని ప్రశ్నిస్తున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే, మిగతారాష్ట్రాలకంటే లీటర్ కు రూ.10లు అదనంగా వసూలుచేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధిలో చంద్రబాబునాయుడికంటే తక్కువఖర్చుపెట్టిన జగన్మోహన్ రెడ్డి, పేదలను వేధించిమరీ వారివీపులు పగలగొట్టిమరీ వసూలుచేస్తున్నదంతా ఎటుపోతోంది? ఆసొమ్మంతా ఆయన దోపిడీ విభాగంకిందకే వస్తుంది.

మద్యం అమ్మకాలు రూపంలో రూ.6వేలకోట్లవరకు ఈ ముఖ్యమంత్రి ప్రజలనుంచి గుంజుకుంటున్నాడు. గతప్రభుత్వం మద్యంకొనుగోళ్లలో 90మిల్లీ లీటర్ల సీసాకు మద్యంకంపెనీలకు రూ.5లు ఇస్తే, ఈముఖ్యమంత్రి ఒక్కో 90ఎమ్.ఎల్. సీసాకు రూ.27వరకు చెల్లిస్తున్నాడు. ఆ విధంగా ఒక్కో సీసాకు ముఖ్యమంత్రి చెల్లిస్తున్న రూ.22లు తిరిగి, ఆయనఖజానాకే చేరుతోంది. ఆ విధంగా ఏటా జగన్మోహన్ రెడ్డి జేబులోకివస్తున్న సొమ్ముఏటారూ.6వేలకోట్లు.

రంగులు వేయడం, తీయడం పేరుతో రూ.3వేలకోట్లకు పైగా స్వాహా చేశారు. అంబులెన్సుల విక్రయం పేరుతో, బియ్యం రవాణావాహానాలపేరుతో కూడా దోచుకున్నారు. సెంటుపట్టాల పేరుతో, ఇళ్లస్థలాలిచ్చి పేదలను ఉద్ధరిస్తున్నామంటూ రూ.7నుంచి రూ.8వేలకోట్లవరకు కాజేశారు. ఎకరం రూ.5లక్షలనుంచిరూ.10లక్షల విలువఉంటే, దానికి రూ.40లక్షల నుంచి రూ.50లక్షలవరకు చెల్లించారు. ఇసుక, గ్రావెల్, ఎర్రచందనం అమ్మకాలతో దోచుకుంటున్నది చాలక పెట్రోల్, డీజిల్ ధరలపెంపు, ఇతరత్రా పన్నులరూపంలో ఈ ముఖ్యమంత్రి చేస్తున్న దోపిడీని మాటల్లో చెప్పలేం. ప్రజలనుంచి వస్తున్నసొమ్ముతో పాటు, అప్పులుతెచ్చిందంతా కూడా ముఖ్యమంత్రి లూఠీ,దోపిడీకే పోతుంటే, ఇకరాష్ట్రం ఎక్కడ బాగుపడుతుంది?

రోడ్లు కూడా వేయలేని ఈ చేతగాని ముఖ్యమంత్రి, రోడ్లసెస్సు పేరుతో కూడా వాహనదారులనుంచి అయినకాడికి దండుకుంటున్నాడు. సాక్షిపత్రికలో మాత్రం రోడ్లు వేసినట్లు చూపిస్తారు… వాస్తవంలో మాత్రం ప్రజల నడుములు విరగ్గొడుతున్నారు. 2014-19 మధ్యన చంద్రబాబునాయుడి హాయాంలో గ్రామాల్లోకూడా ఎక్కడా మట్టిరోడ్లు లేకుండాచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జాతీయరహదారులపై గుంతలను కూడా పూడ్చకుండా, వర్షాలు పడుతున్నాయి.. వరదలొస్తున్నాయి అని కారుకూతలు కూస్తన్నారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు చెప్పే అబద్ధాలు, దొంగమాటలు నమ్మితే ప్రజలు దారుణంగా మోసపోతారని విన్నవిస్తున్నాం.

LEAVE A RESPONSE