( సాయి ధనుష్)
అమెరికాలో సిఐఏ ఆపరేట్ చేసే డీప్ స్టేట్ అంటే ఏంటి?
దీనికి భారతదేశానికి సంబంధం ఏమిటి?
మోదీ ని హత్య చేయడానికి చేసిన ప్రయత్నాలు, ఇందులో అమిత్ షా కూడా ఎలా చేరారు?
రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ కి డీప్ స్టేట్ కి ఏం సంబంధం? ఇప్పుడు దేశంలో పరిస్థితి ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా లోతుగా ఉంటాయి. ఇప్పుడు జరిగిన ఒక సంఘటనను చూడండి – ‘కాశ్మీర్ టైమ్స్’ అనే మీడియా ఆఫీస్‌పై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు రేడ్ చేశారు. ఆ ఆఫీసులోనే 47 ఏకే-47 రైఫిళ్లు, మిషన్ గన్స్ దొరికాయి.
ఒక పత్రికా ఆఫీసులో ఇవి ఎందుకు? ప్రెస్ ఫ్రీడమ్ పేరుతో ఇది జరగడం ఏమిటి? ఇలాంటి ఆయుధాలు దొరికితే, మీకు ఏమనిపిస్తుంది?
దీన్ని అర్థం చేసుకోవడానికి, మూడు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఇది కేవలం భారత్ విషయం మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా ఇదే జరుగుతోంది. డీప్ స్టేట్ గురించి తెలుసుకోవాలంటే లోతైన రీసర్చ్ చేయాలి, ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం.
1. సహజ వనరులపై దృష్టి: ఆఫ్రికా ఉదాహరణ
మీకు ఒక షాకింగ్ నిజం చెప్తాను. ఆఫ్రికాలో బ్రిటిష్, ఫ్రెంచ్, బెల్జియం సామ్రాజ్యాలు తమ చేతులలోకి తీసుకున్న దేశాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడి ప్రజలను హింసించి, దేశాలను ఆక్రమించుకున్నారు. ఒక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆ దేశ అధ్యక్షుడు అమెరికాకు వెళ్లాడు.
అక్కడ అతను చెప్పాడు: “మా దేశంలో యురేనియం బాగా దొరుకుతుంది. మీరు ఒప్పుకుంటే అమ్ముతాము. ఆ డబ్బుతో మా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటాము.”
కానీ అమెరికా వారు నో చెప్పారు. బెల్జియం వారు పెట్టిన నియమాల ప్రకారం మాత్రమే నడుచుకోవాలని ఆదేశించారు. “మాకు స్వాతంత్ర్యం వచ్చింది కదా, ఇది మా ఇష్టం” అని అధ్యక్షుడు ప్రశ్నించాడు. “నేను రష్యాకు అమ్ముతాను, పుతిన్ ను కలుస్తాను” అని అన్నాడు. కానీ కొద్ది వారాల్లోనే అతను హత్య చేయబడ్డాడు. ఇదే డీప్ స్టేట్ పద్ధతి. మోదీ గారు, అమిత్ షా గారి విషయంలో కూడా ఇదే ప్లానింగ్ జరుగుతోంది. ఎందుకు? మీ దేశంలో ఉన్న సహజ వనరులు, మానవ వనరులు వాళ్ళదే కావాలి.
2. చరిత్రను వక్రీకరించడం మరియు మానసిక యుద్ధం
గాంధీగారు ఆఫ్రికాకు ఎందుకు వెళ్లారు? ఒక ప్రసిద్ధ సీన్ లో, గాంధీగారిని ట్రైన్ నుంచి తోసేస్తారు. ఆ సమయంలో ఆయన “ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నేను అంతం చేస్తాను” అని అనుకున్నాడని మనం ఊహించుకుంటాం.
కానీ నిజం ఏమిటి? ఆయన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక వర్కర్ గా పని చేయడానికి వెళ్లాడు. ఆయన తనను తాను యజమాని సీటులో చూడాలనుకున్నాడు, కానీ వారు ఒప్పుకోలేదు. ఆయన వాదన ఏమిటంటే, “మేము ఈ నల్లవాళ్ళలాగా మీ బానిసలము కాము, మేము మీ సామ్రాజ్యం యొక్క పౌరులము.” ఇక్కడ ఎటువంటి స్వాతంత్ర్య సంగ్రామం లేదు. ఎందుకంటే డీప్ స్టేట్ లో అది జరగదు. మీరు వాళ్ళను ఎదిరించకూడదు. వాళ్ళు కోరిన సహజ వనరులు మీరు ఇచ్చేయాలి. మీరు ‘సెల్ఫ్ రిలయంట్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’ అని మాట్లాడితే, వీళ్ళు ఒప్పుకోరు.
3. భారతదేశంలో డీప్ స్టేట్ యొక్క చర్యలు
హోం మంత్రి అమిత్ షా గారు ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియదు. నక్సలిజం పట్ల మనందరికీ సానుభూతి ఉండేది. కానీ ఇవాళ మన రాష్ట్రపతి, ఒక గిరిజన మహిళ, ప్రజలలో ఉంటూ కాలాన్ని మార్చారు. మీరు అడవుల్లో ఉండి గిరిజన ప్రజలను కాపాడతామని అనుకోవచ్చు, కానీ నిజం అది కాదు. అక్కడ ఉన్న వనరుల మీదే అందరి దృష్టి ఉంటుంది. సిఐఏ లాంటి ఏజెన్సీలు ఇక్కడే తిరుగుతూ ఉంటారు, మన అడవుల్లోకి వచ్చి ఎలాంటి ప్రకృతి వనరులు ఉన్నాయో చూస్తారు.
ఇంకొక ఉదాహరణ చూడండి: ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రాంతంలో బాగా ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) దొరుకుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ట్రక్కులు ట్రక్కులుగా ఈ ఖనిజాన్ని తవ్వి చైనాకు పంపించేవాళ్ళు. చైనాలో అది శుద్ధి చేయబడి, మళ్లీ అదే ఖనిజాన్ని భారతదేశానికే అమ్ముతారు. మన దగ్గరే మెషినరీ ఉంటే మనం ఇక్కడే చేసుకోవచ్చు కదా! కానీ చైనాకు లాభదాయకమైన వ్యాపారం మనం చేసి పెట్టాలి. ఇది యూరోపియన్ ఆలోచన. వీళ్ళంతా డీప్ స్టేట్ లో భాగమే. ప్రతి రాష్ట్రంలోనూ, మూలల మూలలలో ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు. మీ దేశం యొక్క సహజ వనరులు విదేశాలకు వెళ్లిపోవాలి.
మానవ వనరులు.. సాంస్కృతిక మార్పు
అమెరికా వారు ఎందుకు చెబుతారో తెలుసా? ప్రపంచంలోనే టాప్ టెక్నీషియన్లు అంతా అమెరికాలో ఉండాలి. ఎందుకు? మీ హ్యూమన్ రిసోర్సెస్ అమెరికాలో ఉంటే మీ దేశం ఎదగదు కదా! ఇదే వాళ్ళ ప్లాన్.
తరువాతి స్థాయిలో, గ్రామాల్లోకి వెళ్లి చూడండి. మణిపూర్, మిజోరం, త్రిపుర లేదా ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలు – ఎక్కడైనా మత మార్పిడులు (కన్వర్షన్స్) ఎక్కువగా జరుగుతాయి. ఇది జరగడం వలన ఏమవుతుంది? ఆ ప్రజలు వేరే మతంలోకి వెళ్లిపోయి, వాళ్ళు అమ్మే ఉత్పత్తులే కొంటారు. ఇది కూడా డీప్ స్టేట్ లో ఒక భాగమే.
టెక్నాలజీపై నియంత్రణ:
మూడవ స్థాయి టెక్నాలజీ. ఈ టెక్నాలజీ పూర్తిగా అమెరికా చేతుల్లో ఉండాలి. అప్పుడే వాళ్ళు మాత్రమే ఎదుగుతారు, మిగతా వారు ఎదగకుండా ఉండిపోతారు. ఇవాళ మీరు ఉపయోగించే Google, YouTube, Facebook అన్నీ అమెరికా వాటాలు. చైనా, పాకిస్థాన్, యూరప్ లోని ఎన్నో దేశాలు ఈ ప్రణాళికలో భాగమే. రూలింగ్ మీది, మీరే అధికారంలో ఉండాలి, కానీ పాలసీ మాత్రం మాది. మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలి. అలా చేస్తే మీరు అధికారంలో ఉంటారు. లేకపోతే, మిమ్మల్ని తొలగించడం మాకు చాలా ఈజీ.
కానీ పుతిన్ లాగా, మోదీ లాగా పులి మీద స్వారీ చేసే నాయకులు ఉంటే, వాళ్ళు తిరగబడతారు. ఈ డీప్ స్టేట్ ని భారత్‌లోనో, రష్యాలోనో లేకుండా చేస్తున్నారు కాబట్టే, దేశంలో ఇలాంటి యుద్ధం జరుగుతోంది.
మనం ‘నక్సలైట్స్’ అని పిలిచేవాళ్ళు ఎక్కడో అడవుల్లో తిరుగుతున్నారు అనుకున్నారా? కాదు. పోలీసులు, సిఆర్పిఎఫ్ వెళ్లని ప్రాంతాలకు కూడా వీళ్ళు వెళ్లగలరు. వీళ్ళకు ఆయుధాలు సరఫరా చేయగలరు. “ఈ భూములంతా మనదే, మన ఇష్టం వచ్చినట్టు మైనింగ్ చేసుకోవచ్చు” అని చెప్పి, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని స్థానిక ప్రభుత్వాలను నియంత్రిస్తారు. సహజ వనరులను తమ పట్టులో పెట్టుకుని, వాటిని అమ్మి డబ్బులు సంపాదించుకుంటారు. ఇవాళ, భారతదేశం ఈ డీప్ స్టేట్ చేస్తున్న కుట్ర నుంచి బయట పడడానికి, వాళ్ళను తిప్పికొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది!