Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డిని ఓడించండి

– 4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేసింది
– వై.వి.బి. రాజేంద్రప్రసాద్
-సర్పంచులకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్ , కార్పోరేటర్స్ కు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ పిలుపు

సర్పంచ్ ల, 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు సర్పంచుల ధర్నా కార్యక్రమం రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ గారు , సర్పంచ్ల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయము ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం మా గ్రామ పంచాయతీలకు చెందవలసిన మైనింగ్ సెస్, ఇసుకలో వాటా నిధులు, రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రొఫెషనల్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్, నీటి తీరువా నిధులు,తలసరి గ్రాంట్, గ్రామీణ రోడ్ల నిర్వహణకు ఇచ్చే నిధులు 2019 వరకు మా గ్రామపంచాయతీలకే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం లేదని, కనుక 2019 నుంచి 2023 వరకు నాలుగు సంవత్సరాలు ఎగ్గొట్టిన ఆ నిధులు సుమారు రూ. 4 వేల కోట్ల రూపాయలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని రాజేంద్రప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా “ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైయస్సార్సీపి పార్టీని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని – రాష్ట్రంలోని అన్ని పార్టీలకు వైయస్సార్సీపి, బిజెపి, టిడిపి, జనసేన,సిపిఎం, సిపిఐ లకు చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు, కౌన్సిలర్ కు, కార్పొరేటర్స్ కు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు.

అన్ని పార్టీల వైయస్సార్సీపి, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం చివరకు అధికార పార్టీ వైఎస్ఆర్సిపి తో సహా సర్పంచులు,ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్స్,కార్పొరేటర్స్ గత మూడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు” అని రాజేంద్రప్రసాద్ విమర్శించారు.

12,918 గ్రామాలలోని 3 కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని. మేము స్థానిక ప్రజాప్రతినిధులం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయి, అసమర్థులుగా, చేతకాన్ని వాళ్ళలా మా గ్రామాల ప్రజల చేత తీవ్ర నిందలు పడ్డాము. కానీ తప్పు మాది కాదు – జగన్ ది” అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

” అందుకే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనమైపోతారని, స్థానిక ప్రజా ప్రతినిధులు అన్యాయమైపోతారని, అందుకే జగన్మోహన్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్పడానికి, గ్రామీణ ప్రజలకు తగిన న్యాయం చేయడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగిందని” రాజేంద్రప్రసాద్ చెప్పారు.

“జగన్ ఓడితేనే – మన మనుగడ” అనే నినాదంతో అన్ని పార్టీల సర్పంచులు, ఎంపీటీసీలు,ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఈ రెండు నెలలు చిత్తశుద్ధితో పట్టుదలగా తమ తమ గ్రామాలలో, పట్టణాలలో పనిచేయాలని” రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, చిత్తూరు, సర్పంచుల సంఘం గౌరవ సలహాదారులు పిల్లి సత్తి రాజు ,పశ్చిమగోదావరి జిల్లా పంచాయితీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు, కడలి గోపాల్ రావు , చుక్క ధనుంజయ్ యాదవ్,సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE