Suryaa.co.in

Telangana

ఢిల్లీలో ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ఆసుపత్రులు

– ఈ నెల 26న మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యమందించేందుకు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి మూడు వైపులా అధునాతన దవాఖానలు నిర్మించబోతోంది.

తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి రూ.రూ.2,679 కోట్లతో పరిపాలన అనుమతులు ఇప్పటికే మంజూరు చేసింది.
కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్‌ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి.

ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో నగరం నలువైపులా సూపర్ స్పెషాల్టీ దవాఖాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌.. అనేక దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే దిక్కు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటివైపే చూస్తారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఏండ్లు గడిచినా.. జనాభా అంతకంతకు పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పెద్దాసుపత్రి నిర్మాణం జరుగలేదు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఒకటి, రెండు.. కాదు.. ఏకంగా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు హైదరాబాద్‌ మహా నగరం వేదిక కాబోతున్నది.

ఆసుపత్రుల వివరాలు…..
* ఒక్కో దవాఖానను 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు.
* ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు ఏర్పాటు చేస్తారు.
* వైద్య విద్య కోసం పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
* అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

1) అల్వాల్
మొత్తం విస్తీర్ణం: 28.41 ఎకరాలు
ఎత్తు: జీ+5
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.897 కోట్లు

2) ఎల్బీనగర్
మొత్తం విస్తీర్ణం: 21.36 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.900 కోట్లు

3) సనత్ నగర్..
మొత్తం విస్తీర్ణం: 17 ఎకరాలు
ఎత్తు: జీ+14
భవనం విస్తీర్ణం: 13.71 లక్షల చదరపు అడుగులు
వ్యయం: రూ.882 కోట్లు

LEAVE A RESPONSE