మీకు తెలుసా?
ఢిల్లీలో మెడికల్ కాలేజి కట్టాలని 1959లో నిర్ణయించారు. కానీ, ఢిల్లీలో మెడికల్ కాలేజి కట్టాలి అంటే కనీసం 25/30 ఎకరాలు ఖాళీ స్థలం కావాలి. అందుకని ఢిల్లీలో ఉన్న పాత సెంట్రల్ జైలు ని పడగొట్టి ఆ ఖాళీ స్థలంలో మెడికల్ కాలేజీ కట్టడానికి నిర్ణయించారు.
ఢిల్లీ గేట్ వద్ద వుండే ఆ జైలు అప్పటికీ ధృడంగా ఉండి జైలు గానే ఉపయోగపడుతూ ఉండేది. 1958 వరకు దీనికి ఢిల్లీ సెంట్రల్ జైలు గానే ఉపయోగించేవారు.
స్వాతంత్ర సమర కాలం లో ఈ జైలులో చాలా మంది స్వాతంత్ర యోధులను బందీలుగా ఉంచారు. ముఖ్యంగా 1912 లాహోర్ కుట్ర అని చెప్పబడే అప్పటి గవర్నర్ జెనెరల్ మరియు వైస్రాయ్ అయిన లోర్డ్ హార్డింజ్ రాజధాని ని కలకత్తా నుండి ఢిల్లీ కి మార్చిన సందర్భంగా తన భార్యతో కలిసి ఏనుగు అంబరీ మీద ఢిల్లీలోకి ఊరేగింపుగా వస్తూ ఉండగా, ప్రముఖ NIA నేత మరియు నేతాజీ శిష్యుడు అయిన రాస్ బిహారీ బోస్ ఆధ్వర్యంలో మాస్టర్ అమీర్ చంద్, జై బాల్ ముకుంద్, మాస్టర్ అవద్ బిహారీ మరియు బసంత్ కుమార్ బిస్వాస్ మొదలగు వారు ఈ అంబరీ మీద బాంబు దాడికి పాల్పడ్డారు. వైస్రాయ్ వెనుక ఉన్న సేవకుడు వెంటనే చనిపోగా వైస్రాయ్ కి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటన వెంటనే వారు తప్పించుకుపారిపోయారు. రాస్ బిహారీ బోస్ జపాన్ పారిపోగా మిగతా 4గురు తర్వాత బ్రిటిష్ పోలీసులకు చిక్కితే పైన చెప్పిన ఈ ఢిల్లీ జైల్లోనే వారిని విచారణ చేసి ముగ్గురిని ఇక్కడ ఉరితీయగా ఒకరికి పంజాబ్ లో అంబాలా జైల్లో ఉరితీశారు.
పైన చెప్పుకున్న వీరులు మాత్రమే కాదు, డిసెంబర్ 17, 1927న బ్రిటిష్ అధికారి జె.పి. సాండర్స్ హత్యకు, ఆ తర్వాత ఏప్రిల్ 8, 1929న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై బాంబు దాడి ఆరోపణలు తో భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురులను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసి ఈ జైల్లో సాలిటరీ కంఫైన్ మెంట్ లో ఉంచారు అంటే వారిని ఏకాంత ఇరుకు చీకటి జైలు గదుల్లో నిర్బంధించారు.
మార్చి 23, 1931న లాహోర్ సెంట్రల్ జైలులో వారిని ఉరితీశారు. ఈ మొత్తం స్వాతంత్ర్య పోరాట కాలంలో ఈ పాత ఢిల్లీ సెంట్రల్ జైలు సమరయోధుల (నిందితుల) కీలక నిర్బంధ ప్రాంగణంగా మరియు విచారణ స్థలంగా పనిచేసింది.
ఇంత చారిత్రక విలువ మరియు భారత స్వాతంత్ర్య సంగ్రామ విప్లవ వీరుల బలిదానానికి చిహ్నంగా మిగిలిన ఈ జైలుని దాని లోని ఏకాంత చీకటి జైలు గదులను గుర్తించి మొత్తం జైలుని ఏ మెమోరియల్ గా మార్చి పర్యాటక క్షేత్రంగా తీర్చి దిద్దవలసింది.
కానీ, దురదృష్టవశాత్తు అప్పటి అహింసా వాద పాలకులకు ఇటువంటి విప్లవ వీరుల చరిత్ర భావితరాలకు తెలియకూడదు అనే దుర్బుద్ధి ఏమైనా పుట్టింది ఏమో మనకు తెలియదు. కానీ, ఇంత చారిత్రక విలువ గల ఈ జైలు సముదాయాన్ని పూర్తిగా కూల్చి వేసి, వారి బలిదానాల భౌతిక చిహ్నాలను పూర్తిగా ధ్వంసం చేసి మెడికల్ కాలేజి నిర్మించారు.
పోనీ ఆ మెడికల్ కాలేజీకి అయినా విప్లవ వీరుల పేరు పెట్టారా అంటే లేదు, సెక్యులర్ నెహ్రు సెక్యులర్ స్నేహితుడు అని మౌలానా అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అంటే అబుల్ కాలం ఆజాద్ పేరు పెట్టారు.
వారు చేసిన ఈ ద్రోహానికి సామాన్య జనాలు ఛీ కొట్టకుండా ఉండటానికి ఏమో ఆ మెడికల్ కాలేజీలో పాధాలజీ విభాగం, మర్చ్యురీ విభాగానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న స్థలంలో ‘షాహీద్ స్మారక్’ అని గ్రానైట్ లో ఒక స్థూపం నిర్మించి, విప్లవ వీరులు ఉరితీయబడ్డ స్థలంలో ఒక గ్రానైట్ పలక మీద అక్కడ ఉరితీయబడ్డ కొందరి విప్లవవీరుల పేర్లు రాశారు. అంతే వారి బలిదానాల భౌతిక చరిత్ర ఆ జైలు శిథిలాలతో పాటు పూడ్చివేయబడింది.
సరే! నిజంగా ఢిల్లీలో మెడికల్ కాలేజి నిర్మించడానికి ఈ జైలు తప్ప వేరే ఖాళీ స్థలం లేదా?
ఢిల్లీలో ఇతర స్మారకాలు చూడండి
1. 52.6 ఎకరాల స్థలంలో నెహ్రూ సమాధి శాంతి వనం నిర్మించారు.
2. గాంధీ రాజఘట్ 40 ఎకరాలు
3. నెహ్రూ ప్రధానిగా చేసిన 30 ఎకరాల తీన్ మూర్తి భవన్ ని నెహ్రూ మెమోరియల్ గా మార్చారు.
4. ఇందిరా శక్తి స్థలం 45 ఎకరాలు
5. రాజీవ్ వీర్ భూమి 15 ఎకరాలు.
అంటే దేశ రాజధాని ఢిల్లీ లో ఒక్క నెహ్రూ కుటుంబ సభ్యుల స్మారకాలకు సుమారు 180 ఎకరాలు కేటాయించబడ్డాయి.
ఢిల్లీ బాగా పెరిగిన తరువాతే అంతంత ఖాళీ స్థలాలు ఢిల్లీలో లభ్యం కాగా, 1959లో ఖాళీ స్థలం దొరకలేదు లేదా నిరుపయోగంగా ఉన్న దానిని వాడుకలోకి తెచ్చే ఉద్దేశ్యం తో జైలు కూలగొట్టారు అంటే నమ్మశక్యంగా ఉందా?
ఇంకా దారుణ మైన విషయం ఏమిటంటే నెహ్రు లెగసీ దాచడానికి అని నెహ్రూ చనిపోవడానికి ముందే నెహ్రూ సమాధి ఎలా డిజైన్ చేయాలి అని 1957లోనే డిజైన్స్ పిలువగా, సుమారు 100 డిజైన్స్ పరీక్షించారు. అంటే సుమారు 50 ఎకరాలులో సమాధి నిర్మించాలని ముందే ప్లాన్ చేసుకుంటే, మరి ఒక పాతిక ఎకరాల్లో 1959లో మెడికల్ కాలేజి నిర్మించడానికి అని ఎంతో విలువ గల ఈ జైలు ధ్వంసం చేయవలసిన అవసరం ఏం వచ్చింది?
నెహ్రూ కుటుంబ సభ్యుల స్మారకాలు గురించి అంత ఆలోచన చేసిన పెద్దలకు అంత మంది విప్లవవీరుల బలిదనాల చిహ్నంగా ఈ 25/30ఎకరాల స్థలం లో ఉన్న పాత సెంట్రల్ జైలుని స్మారకంగా మార్చాలి అనే ఆలోచన రాలేదు అని అనుకోవాలా? మెడికల్ కాలేజి కట్టడానికి ఈ ముఖ్యమైన జైలు కూల్చడం తప్ప మరో మార్గం లేదు అని నిజంగా అనుకున్నారా?
పోనీ, గాంధీ, నెహ్రూ లు గడిపిన జైలు గదులు లేక జైళ్లని అలాగే.నిర్లక్ష్యం చేశారా? లేదు.
1. నెహ్రూని ఖైదు చేసిన అహమ్మద్ నగర్ ఫోర్ట్/ జైలుని మెమోరియల్ గా మార్చారు.
2. కలకత్తా లో అలిపూర్ జైలు మ్యూజియం గా ఉంది
3. ఉత్తరాఖండ్ లో ఆల్మోరా జైల్లో నెహ్రు ఉన్న వార్డు ని నెహ్రూ వార్డుగా చేసి సందర్శకులకు ఉంచారు
4. నెహ్రూ గడిపిన డెహ్రాడూన్ జైల్ ని హెరిటేజ్ సెంటర్ గా మార్చారు
5. గాంధీ గారు గడిపిన అఘా ఖాన్ పేలస్ ని జాతీయ స్మారకంగా మార్చారు
6. మహారాష్ట్ర లో ఎరవడా జైల్లో గాంధీ గారు గడిపిన జైలు గదులను గాంధీ యార్డ్ అని పేరుపెట్టి సందర్శకులకు అనుమతి రోజూ భజనలు.
7. సబర్మతి జైల్లో గాంధీ గారు గడిపిన గదులు అట్లాగే స్మారక చిహ్నాలు గా ప్రకటించి సందర్శకులకు ఉంచారు.
అంటే, 1947లో భారత్ కి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక పద్ధతి ప్రకారం నెహ్రూ గాంధీ గొప్పతనం తప్ప ఆ కాలంలో స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న అనేక మంది ఇత స్వాతంత్ర సమర యోధుల గురించి తర్వాత తరాలకు పెద్దగా తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ముఖ్యంగా గాంధీ అనుసరించిన సో కాల్డ్ అహింసా సిద్ధాంతానికి వ్యతిరేకంగా విప్లవ బాట పట్టిన అందరి చరిత్రలు, గుర్తులు కావాలని నిర్లక్ష్యం చేయడమో లేదా మరుగున పడేటట్లు చేయడమో బుద్ధి పూర్వకంగా చేశారు అని అనిపిస్తుంది.
మీరేం అనుకుంటున్నారు?
– చాడా శాస్త్రి