– ఈ రెండు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులు, భూ కేటాయింపులపై విచారణ జరపాలి
– 2019 నుంచి జరిగిన అవకతవకలను వెలికి తీయాలి
– కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్
అమరావతి: షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ లపై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ లేఖ రాశారు. ఈమేరకు ఆయన లేఖలో అనేక అంశాలపై ఫిర్యాదు చేశారు.
అర్హత లేకపోయినా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు వేల కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వంలో
కూడా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు నిబంధలను పక్కనబెట్టి మరీ ఆయాచిత లబ్ది చేకూరుస్తున్నారన్నారు. అలాగే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ కు కూడా
నిబంధనలకు విరుద్దంగా భూములను కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేల ఎకరాల భూములను ఆ ప్రాజెక్ట్ కు కేటాయించడం వెనుక ఉన్న రహస్యాన్ని బయటికి తీయాలన్నారు. ఇందుకోసం గడిచిన ఆరేళ్లలో ఈ రెండు కంపెనీలకు కట్టబెట్టిన ఎలక్ట్రిక్ కాంట్రాక్టులు, భూ కేటాయింపులపై పూర్తి స్ధాయి దర్యాప్తు నిర్వహించాలని హోం మంత్రికి రాసిన లేఖలో కోరారు.