– టీడీపీ పోరుబాటను అడ్డుకోవడం పిరికిపంద చర్య
– టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్
రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యానికి గ్రహణం పట్టింది. ఉత్తరాంధ్రను దోచుకుంటున్న జగన్ రెడ్డి అండ్ కో ఆగడాలు బహిర్గతమవుతాయనే దుగ్ధతో టీడీపీ పోరుబాటను అడ్డుకుంటున్నారు. జగన్ రెడ్డిది పిరికిపంద చర్య. వందలాది మంది పోలీసులతో టీడీపీ శాంతియుత నిరసనను అడ్డుకోవడం చూస్తే.. జగన్ రెడ్డి ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది.
తక్షణమే పోలీసు అక్రమ గృహ నిర్బంధాల నుంచి టీడీపీ నేతలను విడుదల చేయాలి. రుషికొండను బోడిగుండు చేసిన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. జగన్ రెడ్డి అండ్ కో ఉత్తరాంధ్రలో విలువైన భూములు, సహజవనరులను లూటీ చేస్తున్నారు. జగన్ రెడ్డి అవినీతిపై ప్రజాస్వామ్యయుతంగా టీడీపీ చేపట్టిన పోరుబాటను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులతో టీడీపీ ఆందోళనను అడ్డుకున్నా.. ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డికి గుణపాఠం తప్పదు.